Site icon HashtagU Telugu

China-Pak : భారత్ దెబ్బతో చైనాను నమ్మలేకపోతున్న పాక్

Pak China Usa

Pak China Usa

China-Pak : ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ప్రయోగించిన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, డ్రోన్లను అడ్డుకునే స్వదేశీ ఆయుధాలు పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. భారత్ రష్యా నుంచి పొందిన అధునాతన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కారణంగా పాక్ భారత్‌పై వైమానిక దాడులకు వెనుకంజ వేస్తోంది. ఇక చైనా నుంచి కొనుగోలు చేసిన HQ-9P, HQ-16 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, పీఎల్-15 క్షిపణులు భారత్ ముందు ప్రభావితం కావడంలో విఫలమయ్యాయి. దీంతో చైనా తయారీ ఆయుధాలపై విశ్వాసం కోల్పోతున్న పాకిస్తాన్, ఇప్పుడు అమెరికా వైపు మొగ్గు చూపుతోంది.

Pashamylaram : పాశమైలారం అగ్నిప్రమాదంపై నిపుణుల కమిటీ విచారణ ప్రారంభం

పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ, వాషింగ్టన్‌లో అమెరికా అధికారులతో రక్షణ సంబంధాల బలోపేతానికి చర్చలు జరుపుతున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత పాక్ ఎయిర్ చీఫ్ అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇటీవలే పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పాక్ ఎయిర్‌ఫోర్స్‌కు ఆధునికత తీసుకురావడానికి అమెరికా తయారీ ఎఫ్-16 బ్లాక్ సిరీస్‌కు చెందిన 70 యుద్ధ విమానాలు, AIM-7 స్పారో ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు, హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ (HIMARS)లను కొనుగోలు చేయాలని పాకిస్తాన్ యోచిస్తోంది. చైనా పరికరాల విశ్వసనీయతపై గల అనుమానాల కారణంగా పాక్ అమెరికాతో రక్షణ సహకారం పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటోంది.

Congress : అధికారంలో ఉన్నప్పుడు కవిత.. బీసీల గురించి మాట్లాడారా?: మహేశ్‌ కుమార్‌గౌడ్‌