Fire Breaks Out : పాకిస్తాన్‌లోని సెంట్రాస్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం..!!

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని సెంట్రాస్ మాల్ మూడో అంతస్తులో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

Published By: HashtagU Telugu Desk
Pak

Pak

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని సెంట్రాస్ మాల్ మూడో అంతస్తులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక మీడియా ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ప్రకారం, భారీగా మంటలు వ్యాపించాయి. భవనంలోని ఇతర అంతస్తులతో పాటు పై భాగాలకు మంటలు వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక నివేదికలను ఉటంకిస్తూ ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

  Last Updated: 09 Oct 2022, 09:58 PM IST