Pakistan : పాకిస్థాన్ ఆర్మీకి చెందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG)కు చెందిన సీనియర్ అధికారిగా వ్యవహరిస్తున్న మేజర్ ముయిజ్ తేహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదుల చేతిలో హతమయ్యారు. ఈ ఘటన దక్షిణ వజీరిస్తాన్‌లో చోటుచేసుకోగా, పాక్ ఆర్మీకి ఇది పెద్ద షాక్‌గా మారింది. మేజర్ ముయిజ్ 6వ కమాండో బటాలియన్‌లో పనిచేస్తున్నారు. తాజాగా ఓ విశ్వసనీయ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా, ఆయన మరో సైనికుడితో కలిసి సర్గోగా ప్రాంతానికి ప్రత్యేక ఆపరేషన్ కోసం చేరుకున్నారు. అయితే అక్కడే ముయిజ్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడి జరిపారు. ఆ దాడిలో ఆయన తడిసిముద్దయ్యారు. అంతేగాక, లాన్స్ నాయక్ జిబ్రానుల్లా అనే మరో జవాను కూడా అక్కడే హత్యకు గురయ్యారు.
Local Body Elections : సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు
మేజర్ ముయిజ్ 2019లో భారత్‌తో సంబంధం ఉన్న ఓ ఘటనలో వార్తల్లో నిలిచారు. ఆ సమయంలో భారత్ చేసిన ఓ ఆపరేషన్‌లో వింగ్ కమాండర్ అభినందన్‌ను తాము పట్టుకున్నామని ముయిజ్ ప్రకటించారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు పాకిస్తాన్ మీడియాలో ప్రముఖంగా ప్రచారం అయ్యాయి. మేజర్ ముయిజ్ మరణంపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన దేశం కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేశారు. ముయిజ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం.
ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు అధికారులను ఒకేసారి లక్ష్యంగా చేసుకోవడం పక్కా ప్లాన్‌గా భావిస్తున్నారు. పాక్ ఆర్మీ సమాచారం ప్రకారం, ఇదే ప్రాంతంలో గత కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ ప్రత్యేక ఆపరేషన్‌లో 11 మంది ఉగ్రవాదులను చంపినట్టు తెలిపారు. దానికి ప్రతీకారంగా ఈ దాడి జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
సౌత్ ఏషియా టెరరిజం పోర్టల్ లెక్కల ప్రకారం, 2024-2025 మధ్య కాలంలో పాకిస్థాన్‌లో 1200కి పైగా సైనికులు ఉగ్రదాడుల్లో హతమయ్యారు. ఇందులో 2024లో 754 మంది మృతి చెందగా, 2025లో ఇప్పటివరకు ఈ సంఖ్య 500కి చేరుకుంది. ఈ కాలంలో సుమారు 1249 ఉగ్రవాద దాడులు నమోదు అయ్యాయి.
Tejeshwar Murder Case : తేజేశ్వర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్!