Massive Explosion : ఇరాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. తీరప్రాంత నగరమైన బందర్ అబ్బాస్ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. భారీగా మంటలు చెలరేగడంతో నలుగురు మృతిచెందగా, దాదాపు 561 మంది గాయపడ్డారు. పోర్టులోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించినట్లు భావిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ప్రస్తుతానికి తెలియరాలేదు.
Also Read :Sudan War Effect: యుద్ధం ఎఫెక్ట్.. బొగ్గు, ఆకులు తింటున్న జనం
ఒక భవనం కూలిపోయి..
ఈ పేలుడు సంభవించాక దట్టమైన పొగలు(Massive Explosion) వెలువడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పేలుడు ధాటికి రజేయీ నౌకాశ్రయం సమీపంలోని ఒక భవనం కూలిపోయిందని సమాచారం. రజేయీ ఓడరేవు నుంచి ఏటా 80 మిలియన్ టన్నుల సరుకులు ఎగుమతి, దిగుమతి అవుతుంటాయి. ఈ ఓడరేవు సమీపంలోనే ముడి చమురు ట్యాంకులు, పెట్రోకెమికల్ సౌకర్యాలు ఉన్నాయి.
Also Read :Electric Road : ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ రోడ్డు.. ఎలా పనిచేస్తుంది ?
రజేయీ నౌకాశ్రయం గురించి..
పేలుడు చోటుచేసుకున్న రజేయీ నౌకాశ్రయం అనేది ఇరాన్ రాజధాని తెహ్రాన్‌కు దక్షిణం దిక్కున 1000 కి.మీ దూరంలో ఉంది. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టుకు 23 కి.మీ దూరంలో ఈ ప్రాంతం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సప్లై అయ్యే ముడి చమురులో దాదాపు ఐదోవంతు హార్ముజ్ జలసంధి మీదుగానే వెళ్తుంటుంది. ఇది ఇరాన్ సముద్రజలాల పరిధిలోనే ఉంది. హార్ముజ్ జలసంధికి ఉత్తరం దిక్కున రజేయీ నౌకాశ్రయం ఉంది. ఇటీవల కాలంలో ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అంతకుముందు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సైతం యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈనేపథ్యంలో ఇప్పుడు ఇరాన్‌లోని రజేయీ నౌకాశ్రయంలో జరిగిన పేలుడు వెనుక ఎవరున్నారు ? సాంకేతిక లోపం వల్లే ఈ పేలుడు జరిగిందా ? అనే వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై ఇరాన్ భద్రతా సంస్థలు ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయి.