Site icon HashtagU Telugu

Turkey Earthquake: 28 వేలు దాటిన మృతుల సంఖ్య.. ‘ఆపరేషన్ దోస్త్’ ద్వారా భారత్ సహాయం

Turkey and Syria Earthquake disaster

Turkey

టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపంలో (Earthquake) మృతుల సంఖ్య భారీగా పెరుగుతూ పోతోంది. ఇప్పటివరకు ఈ భూకంపంలో మరణించిన వారి సంఖ్య తాజాగా 28వేలు దాటింది. ఈ విషయాన్ని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో టర్కీకి చేయూతనందించేందుకు భారత్ నుంచి మరో C-17 విమానం బయలుదేరింది. ఇందులో ఎమర్జెన్సీ పరికరాలు, ఔషధాలు ఇతర వస్తువులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు 28,000 మందికి పైగా మరణించారు. అదే సమయంలో 80 వేల మందికి పైగా గాయపడినట్లు సమాచారం. వరుసగా ఆరో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలావస్థలో ఇప్పటికీ జీవన్మరణ పోరాటం కొనసాగుతోంది. మృతదేహాలతో పాటు కొందరి ప్రాణాలు కూడా శిథిలాల నుంచి బయటకు తీస్తున్నారు. కొందరిని 90 గంటల తర్వాత శిథిలాల నుంచి బయటకు తీయగా, మరికొందరు 94 గంటల పాటు ప్రాణాలతో పోరాడారు. 144 గంటల తర్వాత ఒకరు శిథిలాల నుంచి బయటకు తీశారు కానీ ఆసుపత్రిలో మరణించారు. శిథిలాల నుంచి ఇలాంటి ఉదంతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు టర్కీ, సిరియాలో సహాయం, రక్షణ కోసం సహాయం అందిస్తున్నాయి.

‘ఆపరేషన్ దోస్త్’ ద్వారా భారత్ సహాయం

‘ఆపరేషన్ దోస్త్’ ద్వారా టర్కీ, సిరియాలకు భారత్ సాయం చేస్తోంది. సహాయం కోసం భారతదేశం ఆర్మీ, NDRF అనేక బృందాలను పంపింది. ఇవి ప్రజలను రక్షించడంలో, గాయపడిన వారికి చికిత్స చేయడంలో సహాయపడుతున్నాయి. భారతదేశం.. టర్కీ, సిరియాలకు ఔషధం నుండి సహాయ సామగ్రి వరకు ప్రతిదీ పంపింది. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ దోస్త్’ను టర్కీ ప్రజలు అభినందిస్తున్నారు.

భారత రిలీఫ్ అండ్ రెస్క్యూ టీమ్ టర్కీలోని హటే ప్రావిన్స్‌లో 30 పడకల ఫీల్డ్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో సర్జికల్, ఎమర్జెన్సీ వార్డులు కూడా ఉన్నాయి. గురువారం నుంచి ఈ ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించారు. శుక్రవారం 106 మంది రక్షించబడిన వ్యక్తులు ఇస్కెండెరున్‌లోని రెండవ ఫీల్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. హేట్‌లోని ఫీల్డ్ హాస్పిటల్‌లోని 99 మంది సభ్యుల బృందంలో 13 మంది వైద్యులు, ఆర్థో, జనరల్ సర్జన్లు, ఓరల్ మాక్సిల్లోఫేషియల్ సర్జన్, కమ్యూనిటీ మెడిసిన్ స్పెషలిస్ట్, లాజిస్టిక్ ఆఫీసర్, ముగ్గురు మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు.

Also Read: Blast In Pakistan: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. ఇద్దరు సైనికులు మృతి.. ముగ్గురికి గాయాలు

ఆసుపత్రిలో ఒక రోగికి 3.5 గంటల సుదీర్ఘ శస్త్రచికిత్స నిర్వహించబడిందని ప్రస్తుతం అతను స్థిరంగా ఉన్నాడని భారత ఆర్మీ అధికారి తెలిపారు.’మూడు రోజుల తర్వాత శిధిలాల నుండి బయటకు తీయబడిన వ్యక్తులు కూడా మా వద్ద ఉన్నారు. మేము వారిని స్థిరీకరించాము, సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తున్నాము. ఓ రోగికి 3.5 గంటల సుదీర్ఘమైన కష్టతరమైన శస్త్రచికిత్స చేశాం. రోగి పరిస్థితి నిలకడగా ఉంది. అతన్ని అదానాలోని టెరిటరీ కేర్‌కు పంపారని తెలిపారు. భారత్ శనివారం టర్కీ, సిరియాలకు మరిన్ని ప్రాణాలను రక్షించే మందులు, సహాయ సామగ్రిని పంపింది. ఈ సామగ్రిని C-17 సైనిక విమానం ద్వారా పంపారు. భారతదేశం టర్కీ, సిరియాలకు 6.19 టన్నుల బరువున్న 841 కార్టన్‌ల మందులు, రక్షణ భద్రతా సాధనాలు, డయాగ్నోస్టిక్‌లను పంపింది. రష్యా కూడా ఈ దుర్ఘటనలో సిరియాకు ఎంతో సాయం చేస్తోంది. భూకంప బాధితుల కోసం రష్యా సైనిక విమానాల ద్వారా ఆహార పదార్థాలు, మందులను పంపింది.