హైదరాబాద్ (Hyd) సంస్థానాన్ని పాలించిన నిజాం రాజులు నిర్మించిన అనేక చారిత్రక కట్టడాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు ఇవాళ్టికీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. వాటిలో ఒకటి ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital). ఇది నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఉస్మానియా ఆస్పత్రి కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా పాకిస్తాన్‌లోని కరాచీ(Pakistan’s Karachi)లో కూడా ఉందని చాలా మందికి తెలియదు. ఆపరేషన్ పోలో అనంతరం హైదరాబాద్ నుంచి పాకిస్తాన్‌కు వలస వెళ్లినవారి కోసం అక్కడ హైదరాబాద్ ట్రస్ట్ ఏర్పడి, దాని ఆధ్వర్యంలో ఉస్మానియా ఆస్పత్రి స్థాపించబడింది.
CM Revanth Reddy: తెలంగాణ విద్యా విధానం దేశానికే మార్గదర్శకం: సీఎం రేవంత్ రెడ్డి
1950లో కరాచీలో “హైదరాబాద్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ట్రస్ట్” పేరుతో ఈ ఆస్పత్రిని నమోదు చేశారు. ఈ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశ్యం వలస వెళ్ళిన హైదరాబాదీలకు పునరావాసం కల్పించడం, ఆరోగ్య సదుపాయాలు అందించడం. ఈ ఆస్పత్రి ద్వారా అర్హులైన వారికి తక్కువ ధరలకు లేదా ఉచితంగానే వైద్య సేవలు అందిస్తున్నారు. ట్రస్టు బోర్డులో రిటైర్డ్ అధికారులు, వైద్య నిపుణులు, సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు వంటి వారు సభ్యులుగా ఉంటారు. ముఖ్యంగా, ఈ ట్రస్ట్ ఏర్పాటులో నిజాం రాజుల ఆర్థిక సహకారం గమనార్హం. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిధులు అందించడం ద్వారా ఈ ట్రస్ట్ ఆవిర్భవించింది.
ఆ సమయంలో హైదరాబాద్ సంస్థానానికి చివరి ప్రధానమంత్రిగా పనిచేసిన మీర్ లాయక్ అలీ, ఈ ట్రస్ట్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఆపరేషన్ పోలో తరువాత ఆయనను భారత బలగాలు నిర్బంధించినప్పటికీ, చివరికి ఆయన పాకిస్తాన్ చేరుకుని వ్యాపారవేత్తగా ఎదిగారు. రాజకీయ రంగంలోకి రావాలని ఆహ్వానాలు అందుకున్నప్పటికీ, ఆయన వాటిని తిరస్కరించారని తన “హైదరాబాద్ విషాదం” పుస్తకంలో పేర్కొన్నారు. ఈ విధంగా, కరాచీలోని ఉస్మానియా ఆస్పత్రి కేవలం వైద్య సేవలకే కాకుండా, చరిత్రలోని ఒక భాగానికి ప్రతీకగా నిలుస్తూ, హైదరాబాద్ నుంచి వలస వెళ్లిన వారి జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతోంది.