Nuclear Engineers Kidnapped : పాకిస్తాన్‌లో శాంతిభద్రతలు గాడితప్పాయి. తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా 16 మంది న్యూక్లియర్ ఇంజినీర్లను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలోని లక్కీ మర్వత్ వద్దనున్న యురేనియం మైనింగ్ గని వద్దకు వెళ్లిన ఉగ్రవాదులు.. 16 మంది సైంటిస్టులను అపహరించారు. యురేనియంతోనే అణ్వాయుధాలను తయారు చేస్తుంటారు. యురేనియం ప్రాసెసింగ్ ప్రక్రియపై ఆ 16 మంది న్యూక్లియర్ ఇంజినీర్లకు మంచి అవగాహన ఉంది. వారిని ఉగ్రవాదులు భయపెట్టి.. ఆ వివరాలను తెలుసుకుంటే ప్రపంచ భద్రతకే పెనుముప్పు కలుగుతుంది. అణ్వాయుధాల తయారీ సమాచారం టీటీపీ ఉగ్రవాద సంస్థ(Nuclear Engineers Kidnapped) నుంచి తాలిబన్ ప్రభుత్వానికి అందే గండం కూడా ఉంది.
Also Read :Wife Vs Sundays : భార్యలు వర్సెస్ సండేస్.. తన భార్యను ప్రస్తావిస్తూ అదర్ పూనావాలా రియాక్షన్
పాకిస్తాన్‌లో చోటుచేసుకున్న ఈ కిడ్నాప్ ఘటనపై మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. న్యూక్లియర్ ఇంజినీర్లకు ఏదైనా జరగకముందే వారిని కాపాడాలని పాక్ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఇరాన్‌కు యురేనియం తరలుతోందనే ప్రచారం కూడా ఉంది. ఈ అంశంపై ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) దర్యాప్తు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. పాకిస్తాన్ అణ్వాయుధాల భద్రత కూడా ప్రస్తుత పరిణామాలతో ప్రశ్నార్ధకంగా కనిపిస్తోందని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read :Election Code : ‘ఎన్నికల కోడ్’తో ఆటంకమా ? ‘జమిలి’ బిల్లులోని ప్రతిపాదనపై ఈసీ ఫైర్
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ప్రస్తుతం ఘర్షణాత్మక వాతావరణం ఉంది. సరిహద్దుల్లో ఇరుదేశాల సైనిక దళాలు తలపడే పరిస్థితి ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌లోని పలు ప్రాంతాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసిన తర్వాత పరిస్థితులు తీవ్రరూపు దాల్చాయి. పాకిస్తాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) ఉగ్రవాద సంస్థలకు తాలిబన్లే నిధులను సమకూరుస్తున్నారు. ఈ ఉగ్ర సంస్థ స్థావరాలన్నీ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లోనే ఉన్నాయి. అందుకే తాలిబన్లను ఇప్పుడు పాకిస్తాన్ శత్రువుల్లా చూస్తోంది. టీటీపీ ఉగ్రవాద సంస్థ గత రెండేళ్ల వ్యవధిలో పాకిస్తాన్‌లో పెద్దసంఖ్యలో ఉగ్రదాడులకు పాల్పడింది. ఎంతోమంది ప్రాణాలను బలిగొంది.