Site icon HashtagU Telugu

Pakistan : పాకిస్తాన్ అణు స్థావరాలపై ఐఏఈఏ కీలక ప్రకటన

Radiation Leak Pakistan Nuclear Facility Iaea Nuclear Weapons Operation Sindoor

Pakistan : ‘ఆపరేషన్ సిందూర్’‌లో భాగంగా పాకిస్తాన్‌పై భారత్ పలుమార్లు మిస్సైల్ ఎటాక్స్ చేసింది. ఈక్రమంలో పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ పరిధిలో ఉన్న కిరానా హిల్స్ అనే కొండ ప్రాంతంపై భారత మిస్సైళ్లు పడ్డాయి. దీంతో అక్కడ భారీ పేలుళ్లు జరిగాయనే ప్రచారం జరిగింది. కిరానా హిల్స్‌లో పాకిస్తాన్ ఆర్మీ భూగర్భ బంకర్లు ఉన్నాయని, వాటిలో అణ్వస్త్ర వార్ హెడ్‌లను దాచి ఉంచారనే టాక్ వినిపించింది. భారత మిస్సైల్ పేలడంతో పాకిస్తాన్ అణ్వస్త్ర వార్ హెడ్ ఒకటి ధ్వంసమై, రేడియేషన్ లీకేజీ జరిగిందనే వదంతి వ్యాపించింది. దీనిపై ఈరోజు  అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) కీలక ప్రకటన విడుదల చేసింది. ‘‘పాకిస్తాన్‌లోని ఏ అణు స్థావరం నుంచి కూడా అణుధార్మికత వెలువడలేదు. రేడియేషన్ లీకేజీ జరగలేదు’’ అని ఐఏఈఏ స్పష్టం చేసింది.

Also Read :Bank Account Nominees: బ్యాంకు నామినీలు మరో రెండు వివరాలు ఇవ్వాల్సిందే.. ఎందుకు ?

భారత్ దాడి.. దారికొచ్చిన పాక్ 

పాకిస్తాన్(Pakistan) చెప్పుకుంటున్న ప్రధానబలం అణ్వస్త్రాలు. నేరుగా  వాటిని దాచిన భూగర్భ బంకర్లపైనే భారత మిస్సైళ్లు పడ్డాయని తెలిసింది. దీంతో పాక్ వెన్నులో వణుకు పుట్టిందట. ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ కాల్ చేసి గోడు వెళ్లబోసుకున్నారట. అనంతరం డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోడీకి ఫోన్ చేసి,  పాకిస్తాన్ దీనస్థితి గురించి వివరించారట. దీంతో శాంతించిన ప్రధాని మోడీ పాకిస్తాన్‌తో కాల్పుల విరమణకు ఓకే చెప్పారట.

Also Read :Who is Ashok Elluswamy: ‘టెస్లా’కు దిక్సూచి అశోక్ ఎల్లుస్వామి.. ఆయన ఎవరు ?

భారత్ తలుచుకుంటే అవన్నీ భస్మం

భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ అణ్వాయుధాలన్నీ భస్మం అవుతాయని ఆపరేషన్ సిందూర్‌తో  నిరూపితం అయింది. పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచిన సొరంగాల చిట్టా మొత్తం ప్రస్తుతం  భారత వాయుసేన చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పాకిస్తాన్ యుద్ధ విమానాలను నిలిపి ఉంచే ఎయిర్ బేస్‌ల సమాచారం కూడా భారత్‌కు ఉంది. భవిష్యత్తులో పాకిస్తాన్ కయ్యానికి దిగితే.. అవన్నీ భారత సైన్యం చేతిలో బూడిద కాక తప్పదు.