Paris Olympics 2024: డోపింగ్ నిరోధక నిబంధనను ఉల్లంఘించినందుకు నైజీరియా బాక్సర్ సింథియా టెమిటాయో ఒగున్‌సెమిలోర్‌ను పారిస్ ఒలింపిక్స్ నుంచి సస్పెండ్ చేశారు. బాక్సర్ సింథియా టెమిటాయో ఒగున్‌సెమిలోర్‌ను సస్పెండ్ చేసినట్లు ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. బాక్సర్ నుండి సేకరించిన నమూనా నిషిద్ధమైన ఫ్యూరోసెమైడ్ అని ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది.ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు గురువారం పారిస్‌లో నమూనాలను సేకరించారు. కాగా శనివారం గుర్తింపు పొందిన ప్రయోగశాల ద్వారా ధృవీకరించబడింది.
అండర్ 60 కేజీల విభాగంలో 22 ఏళ్ల బాక్సర్ సింథియా టెమిటాయో సోమవారం ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేయాల్సి ఉంది. కాగా ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమైనప్పటి నుండి మరో ఇద్దరు అథ్లెట్లు కూడా సస్పెండ్ అయ్యారు. మరోవైపు డొమినికన్ వాలీబాల్ క్రీడాకారిణి లిస్వెల్ ఈవ్ మెజియాకు ఫ్యూరోసెమైడ్ పాజిటివ్ అని తేలింది.
సింథియాకు చివరి సస్పెన్షన్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ – యాంటీ డోపింగ్ డివిజన్ (CAS ADD) ముందు సవాలు చేసే హక్కు ఉంది. నమూనా విశ్లేషణను అభ్యర్థించే హక్కు కూడా ఆమెకు ఉంది. మరి ఎం జరుగుతుందో చూడాలి.
Also Read: Curd in Rainy Season: వర్షాకాలంలో పెరుగు తినొచ్చా.. తింటే లాభాల కంటే సమస్యలే ఎక్కువ వస్తాయా..?