Site icon HashtagU Telugu

29 Soldiers Killed : ఉగ్రదాడిలో 29 మంది సైనికులు బలి.. ఐసిస్ పనేనా ?

29 Soldiers Killed

29 Soldiers Killed

29 Soldiers Killed : నైజర్ దేశంలో ఘోరం జరిగింది. ఒక జిహాదీ గ్రూపు జరిపిన ఆకస్మిక దాడిలో 29 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రాత్రి పశ్చిమ నైజర్‌లో ఈ ఘటన జరిగిందని నైజర్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. వంద మందికి పైగా ఉగ్రవాదులు భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రితో సైనిక యూనిట్ పై దాడికి తెగబడ్డారని పేర్కొంది.  ఇదే ఘటనలో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. ప్రతిగా నైజర్ ఆర్మీ జరిపిన కౌంటర్ ఆపరేషన్ లో డజన్ల కొద్దీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఉనికి ఇంకా ఉందని.. వారే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నైజర్, మాలి, బుర్కినా ఫాసో దేశాల సరిహద్దుల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రమూకలు స్థావరాలను ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు చేస్తున్నాయని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join

పశ్చిమ ఆఫ్రికాలో బుర్కినా ఫాసో, మాలి, గినియా, చాద్ తరువాత సైనిక పాలనలోకి వెళ్లిన దేశం నైజర్. అసలు విషయం ఏమిటంటే.. ఈ దేశాలన్నీ ఒకప్పుడు ఫ్రెంచ్ వలస ప్రాంతాలే. 1990 నుంచి ఇప్పటివరకు ఆఫ్రికాలోని సబ్ సహారన్ దేశాలలో 27 సైనిక తిరుగుబాట్లు జరగ్గా అందులో 78 శాతం ఫ్రెంచ్ మాట్లాడే దేశాల్లోనే జరిగాయి. దీంతో ఈ తిరుగుబాట్లకు ఫ్రాన్స్‌, ఫ్రాన్స్ వలసవాదమే కారణమనే కోణంలో చర్చ జరుగుతోంది. 1952 నుంచి నాలుగు దేశాల్లో అత్యధికంగా తిరుగుబాట్లు జరిగాయి. నైజీరియాలో 8 సార్లు, ఘనా 10, సియెర్రా లియోన్ 10, సూడాన్‌లో 17 సార్లు తిరుగుబాట్లు జరిగాయి. అవన్నీ ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో ఉన్న దేశాలు. గత మూడేళ్లుగా జరిగిన తిరుగుబాట్లు దేశీయ కారణాలతోనే జరిగాయి. అవి రాజకీయ, సైనిక నాయకుల బలాన్ని (29 Soldiers Killed) తెలియజేస్తోంది.

Also readDental Care Awareness: నోటి పరిశుభ్రత కోసం ఈ సింపుల్ చిట్కాలు మీ కోసం..!