Nuclear Bomb : అణుబాంబు.. చాలా డేంజర్. ఇది భూమిపై పడిందంటే గడ్డిపోచ కూడా మొలవదు. అంతా బూడిదే మిగులుతుంది. ప్రస్తుతం అణుబాంబులు కలిగిన దేశాల జాబితాలో.. రష్యా, అమెరికా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్ (యూకే), పాకిస్తాన్, ఇండియా, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా ఉన్నాయి. ఈ దేశాల వద్ద దాదాపు 13వేల అణుబాంబులు ఉన్నాయి. ఎక్కువ అణుబాంబులు రష్యా దగ్గర ఉన్నాయి. త్వరలో మరో దేశం కూడా ఈ లిస్టులో చేరబోతోంది. మిస్సైళ్ల తయారీలో ప్రపంచంలోనే ఫేమస్ అయిన ఆ దేశం అణుబాంబు తయారీ ప్రక్రియను వేగవంతం చేసిందట. త్వరలోనే అణుబాంబుతో టెస్టింగ్ కూడా చేయబోతోందట. వివరాలివీ..
Also Read :Asaduddin Owaisi : ‘‘మసీదులు, దర్గాల 1 ఇంచు భూమి కూడా పోనివ్వను’’.. లోక్‌సభలో అసద్ వ్యాఖ్యలు
యురేనియం నిల్వలు రెడీ
అణుబాంబును రెడీ చేస్తున్న ఆ దేశం పేరు.. ఇరాన్. అణుబాంబు(Nuclear Bomb) తయారు చేయాలంటే సరిపడా యురేనియం నిల్వలు కావాలి. అవన్నీ ఇప్పటికే ఇరాన్ సమకూర్చుకుందట. శుద్ధి చేసిన యురేనియంను అణుబాంబు తయారీకి వాడుతారు. 90 శాతం మేర శుద్ధి చేసిన 42 కిలోల యురేనియం ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉందని అంటున్నారు. 60 శాతం శుద్ధి చేసిన 200 కిలోల యురేనియం ఇరాన్ వద్ద ఉందని చెబుతున్నారు.ఆ యురేనియం నిల్వలతో ఇంకొన్ని నెలల్లోనే అణుబాంబు తయారీ ప్రక్రియను ఇరాన్ పూర్తి చేయనుందని తెలుస్తోంది.
Also Read :Delhi Polls 2025 : ‘ఢిల్లీ’మే సవాల్.. రేపే ఓట్ల పండుగ.. త్రిముఖ పోరులో గెలిచేదెవరు ?
ఎడారుల్లో అండర్ గ్రౌండ్ ల్యాబ్‌లు
ఇరాన్‌లో చాలా పెద్ద ఎడారులు ఉన్నాయి. వాటిలో కొన్ని ఎడారుల్లో అణుబాంబుల తయారీకి సంబంధించిన రీసెర్చ్ ల్యాబ్‌లను ఇరాన్ నిర్వహిస్తోంది. ఈ సమాచారం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. గత నెల రోజులుగా ఆ ల్యాబ్‌లలో అణుబాంబుల తయారీ ప్రక్రియ స్పీడ్ అయిందట. ఈవిషయాన్ని ఇరాన్‌లోని అమెరికా నిఘా వర్గాలు సేకరించాయంటూ ప్రముఖ మీడియా సంస్థ ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. మరో రెండు నెలల్లోగా అణుబాంబు తయారీ ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఆ కథనంలో ప్రస్తావించారు. పశ్చిమాసియా ప్రాంతంలో ఇరాన్ ప్రధాన ప్రత్యర్ధి ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశానికి అమెరికా అణుబాంబు టెక్నాలజీని అందించింది. ఆ బలంతోనే పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ పెత్తనం చలాయిస్తోంది. ఈ పరిస్థితిని సమం చేసేందుకే అణుబాంబు తయారీ దిశగా ఇరాన్ అడుగులు వేస్తోంది. తద్వారా ఇటీవలే గాజా, సిరియా యుద్ధాల్లో తమకు ఇజ్రాయెల్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారాన్ని తీర్చుకోవాలని భావిస్తోంది.