Site icon HashtagU Telugu

Netanyahu : “మేము మొదలుపెట్టాం.. అమెరికా పూర్తి చేసింది”.. నెతన్యాహు వ్యాఖ్యలు

Netanyahu

Netanyahu

Netanyahu : ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించిన సందర్భంలోనే ఆ దేశానికి తాను ఇచ్చిన మాటను నెరవేర్చినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. అణ్వాయుధ దేశంగా ఇరాన్ మారడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్న తన గత వ్యాఖ్యలను ఆయన మరోసారి గుర్తుచేశారు. అణుశక్తి కేంద్రాలపై దాడులు చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేస్తూ, ఈ లక్ష్యం సాధించే వరకు దాడులు కొనసాగిస్తామని అన్నారు.

ఇటీవల అమెరికా చేపట్టిన వైమానిక దాడులను ప్రస్తావిస్తూ, తాము ప్రారంభించిన పనిని ఇప్పుడు అమెరికా పూర్తిచేసిందని నెతన్యాహు పేర్కొన్నారు. ఈ చర్యకు సంబంధించిన సమాచారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి తనకు చెప్పినట్టు తెలిపారు. ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశానని తెలిపారు.

ఈ దాడులు చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తాయని వ్యాఖ్యానించిన నెతన్యాహు, ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ పరిణామాలను మార్చేంత గొప్పదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసి, అమెరికా చర్యపై తన అభినందనలను తెలిపారు.

Zepto : చెన్నైలో ఐటీ ఉద్యోగినిపై జెప్టో డెలివరీ బాయ్ అత్యాచారయత్నం