Bidens Removal : బైడెన్‌ను తీసేయండి.. వైస్ ప్రెసిడెంట్ కమలకు అటార్నీ జనరల్ లేఖ

Bidens Removal : ‘‘81 ఏళ్ల వయసున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మెంటల్లీ  వీక్‌గా ఉన్నారు.. మెంటల్లీ  స్ట్రాంగ్‌గా ఉన్న దేశాధ్యక్షుడు అవసరం’’ అని అమెరికాలోని వెస్ట్ వర్జీనియా అటార్నీ జనరల్, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నేత పాట్రిక్ మోరిసే సంచలన విమర్శలు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Bidens Removal

Bidens Removal

Bidens Removal : ‘‘81 ఏళ్ల వయసున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మెంటల్లీ  వీక్‌గా ఉన్నారు.. మెంటల్లీ  స్ట్రాంగ్‌గా ఉన్న దేశాధ్యక్షుడు అవసరం’’ అని అమెరికాలోని వెస్ట్ వర్జీనియా అటార్నీ జనరల్, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నేత పాట్రిక్ మోరిసే సంచలన విమర్శలు చేశారు. మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉన్న దేశాధ్యక్షుడిని ఎంపిక చేసుకునేందుకుగానూ రాజ్యాంగంలోని 25వ సవరణను అమలు చేయాలని  భారత సంతతికి చెందిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కు ఆయన ఒక లేఖ రాశారు.  25వ రాజ్యాంగ సవరణను అమలు చేసి.. బైడెన్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని(Bidens Removal) కోరారు. 81 ఏళ్ల బైడెన్ శారీరక, మానసిక సామర్థ్యాలపై పాట్రిక్ మోరిసే ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘బైడెన్‌ను మతిమరుపు చుట్టుముట్టింది. ఒక కొడుకు గతంలో చనిపోయిన విషయాన్ని కూడా బైడెన్ మర్చిపోయారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన టైమ్ లైన్‌ కూడా బైడెన్‌కు గుర్తుకు లేదు’’ అని పేర్కొంటూ  ఇటీవలే 388 పేజీల స్పెషల్ కౌన్సిల్  నివేదిక విడుదలైంది. దీనిపై చాలా రాజకీయ దుమారం రేగింది. దీంతో రంగంలోకి దిగిన బైడెన్ తన మెమోరీ పవర్ బాగానే ఉందని క్లారిటీ ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగానే ఇప్పుడు వెస్ట్ వర్జీనియా అటార్నీ జనరల్ పాట్రిక్ మోరిసే కామెంట్స్ చేయడం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join

గతంలో మాజీ  అమెరికా అధ్యక్షుడు కెన్నెడీ హత్య తర్వాత ఏర్పడిన అత్యవసర పరిస్థితుల్లో తదుపరి అధ్యక్షుడి ఎంపిక కోసం  అమెరికా రాజ్యాంగంలో 25వ సవరణ చేశారు. దీనికి 1965 సంవత్సరంలో అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. దేశ అధ్యక్షుడు భౌతికంగా అసమర్ధుడని నిరూపితమైతే.. అతడిని పదవి నుంచి తప్పించేందుకు  వైస్ ప్రెసిడెంట్, ప్రభుత్వ  మంత్రి మండలి చట్టపరమైన ప్రక్రియను అనుసరించవచ్చు. 25వ రాజ్యాంగ సవరణను అమల్లోకి తేవచ్చు. అయితే ఇప్పటిదాకా ఈవిధమైన రాజ్యాంగ పద్ధతిలో అమెరికాకు చెందిన ఏ ఒక్క అధ్యక్షుడిని కూడా పదవి నుంచి తప్పించలేదు. ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు రెడీ అవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చాలాసార్లు బైడెన్‌ను టార్గెట్ చేశారు. బైడెన్‌కు మతిమరుపు వచ్చిందని.. నడవడం కానీ.. మాట్లాడటం కానీ రావడం లేదని ట్రంప్ ఎద్దేవా చేశారు.  ఈ ఎన్నికల్లో బైడెన్ వయసు అంశాన్నే హైలైట్ చేసి గెలవాలనే ప్లాన్‌లో ట్రంప్ ఉన్నారట. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ నేత,  వెస్ట్ వర్జీనియా అటార్నీ జనరల్ పాట్రిక్ మోరిసే చేసిన కామెంట్స్‌ను కూడా ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుంది.

Also Read : India Vs Maldives : మాల్దీవులకు భారత్ చెక్.. లక్షద్వీప్‌లో రెండు సైనిక స్థావరాల ఏర్పాటు

  Last Updated: 14 Feb 2024, 01:03 PM IST