Astronauts Rescue: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ త్వరలోనే చంద్రుడిపైకి యాత్రను చేపట్టబోతోంది. ఇందులో భాగంగా వ్యోమగాములను ప్రత్యేక లూనార్ ల్యాండర్ ద్వారా చందమామపైకి పంపబోతోంది. అక్కడే కొన్ని రోజుల పాటు వ్యోమగాములు ఉండి, భూమికి తిరిగొస్తారు. ఇదంతా చెప్పుకోవడానికి ఈజీగానే ఉంది. అయితే ఒకవేళ కాలం కలిసి రాక.. జాబిల్లిపైకి వెళ్లి వ్యోమగాములు సకాలంలో తిరిగి రాలేకపోతే ఎలా ? చంద్రుడిపై వ్యోమగాములు కొన్ని రోజుల పాటు సేఫ్‌గా ఉండగలిగేలా ఏమేం చేయొచ్చు ? అనే ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు నాసా వెతుకుతోంది. అటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలి ? అనే దానిపై నాసా శాస్త్రవేత్తలు ముమ్మర పరిశోధనలు చేస్తున్నారు.
Also Read :Brand Raja : ‘బ్రాండ్’ రాజా.. బాలీవుడ్ బాద్షా, బిగ్ బీలను వెనక్కి నెట్టేసిన ధోనీ
ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక శాస్త్రవేత్తలు, సైన్సు నిపుణులు, ఖగోళ సైంటిస్టుల(Astronauts Rescue) నుంచి కూడా నాసా ఐడియాలను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన వారు పైన మనం ప్రస్తావించిన ప్రశ్నలకు సమాధానాలను సవివరంగా రాసి నేరుగా నాసాకు చెందిన HeroX పోర్టల్‌కు పంపొచ్చు. ఇందుకు లాస్ట్ డేట్ జనవరి 23. ఒకవేళ ఎవరిదైనా ఐడియా ఇందుకోసం ఎంపికైతే.. ఇక తిరుగుండదు. వాళ్లు లక్షాధికారి అయిపోతారు. ఎందుకంటే బెస్ట్ ఐడియా ఇచ్చే ఒక వ్యక్తికి దాదాపు రూ.16 లక్షల దాకా పారితోషికం ఇస్తామని నాసా అధికారికంగా అనౌన్స్ చేసింది. చంద్రుడిపై వ్యోమగాములు చిక్కుకుపోయినా.. సేఫ్‌గా ఉండేలా ఏం చేయాలి ? వ్యోమగాముల గుడారాలు ఎలా ఉండాలి ? వాటిలో వాతావరణం ఎలా ఉండాలి ? ఆహారం, నీరు, మరుగుదొడ్ల ఏర్పాట్ల పరిస్థితేంటి ? వంటి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా సమగ్రంగా ఐడియా ఉండాలి.
Also Read :Harish Rao : ఫోన్ ట్యాపింగ్ కేసు.. తెలంగాణ హైకోర్టులో హరీశ్‌రావుకు ఊరట
వ్యోమగాములంతా కలిసి ప్రత్యేక లూనార్ ల్యాండర్ ద్వారా చంద్రుడిపై ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయ్యాక వారికి గాయాలు అయితే ఏం చేయాలి ? మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలి ? వ్యోమగాములు అచేతన స్థితికి వెళితే ఎలా ? అనే ప్రశ్నలకు కూడా నాసా సమాధానాలను అన్వేషిస్తోంది. చంద్రుడి ఉపరితలంపై ఉండగా ఇలాంటి అత్యవసర పరిస్థితి ఎవరైనా వ్యోమగామికి ఎదురైతే.. వెంటనే వారిని లూనార్ ల్యాండర్‌లోకి తీసుకెళ్లి చికిత్స చేయాలి. అయితే స్పేస్ సూట్లు ధరించి ఉండటంతో వ్యోమగాములు వేగంగా లూనార్ ల్యాండర్‌ను చేరుకోలేరు. ఇలాంటి టైంలో కనీసం 2 కిలోమీటర్ల దూరం పాటు వ్యోమగాములను తీసుకెళ్లగలిగే.. డిజైన్ ఏదైనా ఉంటే సమర్పించాలని నాసా కోరుతోంది. ఈ డిజైన్ బాగుంటే రూ.16 లక్షలు ఇస్తామని అంటోంది. చంద్రుడిపైకి మళ్లీ మనిషిని పంపేందుకు 2025లో ఆర్టెమిస్-2 మిషన్‌ను, 2026లో మానవసహిత ఆర్టెమిస్-3 ప్రయోగాన్ని నాసా చేపట్టబోతోంది.