Site icon HashtagU Telugu

World War II Bomb : వరల్డ్ వార్ -2 నాటి బాంబు కలకలం.. 400 ఇళ్లు ఖాళీ

World War Ii Bomb Northern Ireland

World War II Bomb : రెండో ప్రపంచ యుద్ధం టైం నాటి బాంబు కలకలం క్రియేట్ చేసింది.  ఆ బాంబును గుర్తించిన తర్వాత పరిసర ప్రాంతాల  ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు.  ఆ బాంబును నిర్వీర్యం చేసేందుకు రంగంలోకి దిగిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్ పరిసరాల్లోని దాదాపు 400 ఇళ్లను ఖాళీ చేయించింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంతకీ ఈ టెన్షన్ ఎక్కడ నెలకొంది ? వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

నార్తర్న్‌ ఐర్లాండ్‌లోని కౌంటీ డౌన్‌ ప్రాంతంలో ఉన్న న్యూటౌనార్డ్స్‌ ఏరియాలో భవన నిర్మాణ పనుల కోసం స్థలాన్ని చదును చేస్తుండగా అనుమానిత వస్తువును స్థానికులు గుర్తించారు. వారు వెంటనే దీని గురించి పోలీసులకు సమాచాారాన్ని అందించారు. పోలీసులు వచ్చి చూసి అది బాంబు అని గుర్తించారు. అనంతరం బాంబు నిర్వీర్య దళాలను అక్కడికి పిలిపించారు. వారు దాన్ని చూసి.. అది రెండో ప్రపంచ యుద్ధం(World War II Bomb)  కాలం నాటి బాంబు అని నిర్ధారించారు. దాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో కొన్ని ముందుజాగ్రత్త  చర్యలు చేపట్టారు. బాంబు ఉన్న ప్రదేశం చుట్టూ 400 మీటర్ల వ్యాసార్ధంలో ఉన్న ఇళ్లల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. దాదాపు 400 మందిని ఇళ్లు ఖాళీ చేయించి పట్టణ శివారులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. ఆ బాంబును సురక్షితంగా నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ ప్రక్రియ పూర్తికావడానికి ఇంకో ఐదు రోజుల టైం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అప్పటి వరకు ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నాయి.

Also Read :Polio Outbreak : గాజాలో పోలియో మహమ్మారి.. 25 ఏళ్ల తర్వాత తొలి కేసు

రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబును నిర్వీర్యం చేసే వరకు తమకు సహకరించాలని స్థానికులను పోలీసులు కోరారు. ప్రజల భద్రతకు సంబంధించిన పనిలోనే తాము నిమగ్నమై ఉన్నామని తెలిపారు. బాంబును గుర్తించి ఏరియాలోని రోడ్లన్నీ మూసివేశారు. ఆ వైపుగా వాహనాల రాకపోకలన్నీ ఆపేశారు. దీంతో న్యూటౌనార్డ్స్‌ ఏరియాలో కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొంది. స్థానికుల సహాయార్ధం ఒక ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

Also Read :Raksha Bandhan 2024 : నేడు ‘రక్షాబంధన్’ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు