Rohingyas : మయన్మార్‌కు చెందిన రోహింగ్యా తెగవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం హింసను తట్టుకోలేక అక్కడి నుంచి లక్షలాది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు వలస వచ్చారు. ప్రస్తుతం దక్షిణ బంగ్లాదేశ్‌లో ఏర్పాటు చేసిన శరణార్ధి శిబిరాల్లో వాళ్లంతా తల దాచుకుంటున్నారు. అక్కడి పరిస్థితులు కూడా క్షీణించాయి. దీంతో రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి ఇతరత్రా ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదకర సముద్ర ప్రయాణాలు చేస్తున్నారు. పెద్దసంఖ్యలో రోహింగ్యాలతో బయలుదేరుతున్న ఓడలు నడి సముద్రంలో బోల్తా పడుతున్నాయి.
Also Read :Kavitha : కవితపై బీఆర్ఎస్ క్రమశిక్షణా చర్యలు.. షోకాజ్ నోటీసు జారీకి రంగం సిద్ధం ?
కేవలం 2 రోజుల్లోనే మహా విషాదం
ఈ తరహా ఘోర ప్రమాదాలు మే 9, 10వ తేదీల్లో జరిగాయి. ఈ రెండు ఘటనల్లోనూ ఓడలు మునిగిపోవడంతో దాదాపు 427 మంది రోహింగ్యాలు చనిపోయారు. ఈవివరాలను స్వయంగా ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది. ఇవి సముద్రంలో చోటుచేసుకున్న అత్యంత విషాదకర ఘటనలని వెల్లడించింది. ఓడల ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని ఐక్యరాజ్య సమితి అనుబంధ శరణార్థి విభాగం తెలిపింది. మే 9న సముద్రంలో రోహింగ్యాల ఓడ మునిగింది. ఈ ఘటనలో ఓడలో ఉన్న 267 మందిలో 66 మంది బతికారు. మిగితా వారంతా చనిపోయారు.మే 10న రోహింగ్యాల(Rohingyas) మరో నౌక మునిగింది. ఆ ఓడలో ఉన్న 21 మంది బతకగా, మిగితా వారంతా చనిపోయారు.
Also Read :Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి రేసులో ట్రంప్.. ఎన్నో మైనస్ పాయింట్లు
మయన్మార్‌లో అసలేం జరుగుతోంది ?
మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం బౌద్ధ మతాన్ని అనుసరిస్తుంది. సైనిక సర్కారు మతపరమైన నిరంకుశత్వం వల్లే రోహింగ్యా తెగవారు అక్కడి నుంచి ఇతర దేశాలకు వలస వచ్చారు. రోహింగ్యా తెగలోని కొందరు వ్యక్తులు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే, ఆ తెగలోని వారందరినీ ఒకేగాటన కట్టేసి శిక్షించడం సబబు కాదనే అభిప్రాయం అంతర్జాతీయ శాంతి వేదికలపై వ్యక్తమవుతోంది. మయన్మార్ సైనిక ప్రభుత్వానికి భారత్ ఎప్పటికప్పుడు సహాయ సహకారాలను అందిస్తోంది. ఇటీవలే భూకంపం వచ్చినప్పుడు కూడా భారత్ చేదోడును అందించింది. అక్కడి ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లను భారత్ పంపింది. ప్రపంచానికి శాంతిమార్గాన్ని, సేవాభావాన్ని చూపిన మదర్ థెరిసా భారత్‌లోనే తన జీవితాన్ని గడిపారు. అహింసా సిద్ధాంతపు శక్తిని నిరూపించిన మహాత్మాగాంధీ భారత్‌లోనే జన్మించారు. శాంతి, అహింసలకు నెలవైన భారతదేశం తన మిత్రదేశాలను కూడా ఆ బాటలో నడిపించేందుకు ప్రయత్నించాలి.