2025 మిస్ వరల్డ్ (Miss World 2025 )పోటీలు హైదరాబాద్‌లో అద్భుతంగా నిర్వహించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా అందమైన, ప్రతిభావంతమైన యువతులు పాల్గొన్న ఈ పోటీలో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాత (Opal Suchata Chuangsri) విజేతగా నిలిచింది. అనేక సవాళ్లను అధిగమించి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న సుచాత.. ఈ విజయాన్ని తన దేశానికి అంకితమిస్తున్నట్లు తెలిపింది. “ఇది నా జీవితంలో గొప్ప రోజు. మిస్ వరల్డ్ స్టేజ్‌పై థాయ్‌లాండ్‌కు గుర్తింపు తీసుకురావడం గర్వకారణం. ఇది మా దేశానికి తొలి విజయం కావడం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది” అని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది.
Pawan Kalyan Comments : మూర్తి గారు అప్పుడు మీ నోరు ఏమైంది..?
మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన అనంతరం ఓపల్ సుచాత నేషనల్ మీడియాతో మాట్లాడింది. భారతీయ సినిమాలపై ఆమెకు ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. “వీలున్నప్పుడల్లా సినిమాలు చూస్తుంటా. ప్రియాంకా చోప్రా నాకు ఎంతో ఇష్టం. ఆమె నుంచి ప్రేరణ పొందాను. మానుషి చిల్లర్‌ను ఫినాలేలో కలవడం ఆనందంగా ఉంది. అలియాభట్ నటించిన ‘గంగూబాయి కథియావాడి’ నాకు ఎంతో నచ్చింది. ఆ చిత్రం భావోద్వేగాలతో పాటు ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. బాహుబలి (Baahubali ) సినిమా గురించి విన్నాను కానీ చూడలేకపోయా. త్వరలో చూస్తానని మాట ఇచ్చింది. అంతే కాదు ఆ సినిమా రివ్యూ కూడా ఇస్తానని తెలిపి అభిమానుల్లో సంతోషం నింపింది.
సుచాత తన సినీ అభిరుచులను షేర్ చేసుకుంటూ.. బాలీవుడ్‌లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పారు. ఇది తనకు ఓ గొప్ప అవకాశం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శించిన సుచాత, భారతీయ చిత్రసీమపై తన ఆసక్తిని వ్యక్తపరిచారు. మిస్ వరల్డ్‌గా గెలవడం తాను కలగన్న దాన్ని నిజం చేసుకున్న తరహాలో ఉందని, దీనికి ఆమె చేసిన ప్రతి కృషి ఫలించిందని చెప్పారు. ఈ విజయం ఆమె వ్యక్తిగతంగా కాదు, తమ దేశ ప్రజల గర్వకారణమని పేర్కొన్నారు.