China : చైనాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెంగ్డే నగరంలోని లాంగ్‌హువా కౌంటీలో ఉన్న ఒక నర్సింగ్ హోమ్‌లో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
Read Also:Tahawwur Rana: రాత్రికల్లా భారత్‌కు ఉగ్రవాది తహవ్వుర్ రాణా.. ఇతడెవరు ?
కాగా, బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయానికి 20 మందిమృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సుమారు 15 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
చైనా మీడియా నివేదికల ప్రకారం.. రాజధాని బీజింగ్‌కు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంగ్డే నగరంలోని లాంగ్‌హువా కౌంటీ లో గల ఓ నర్సింగ్ హోమ్‌లో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటల ధాటికి అందులోని వారు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.