Tsunami : సునామీ.. ఈ పదం వింటేనే హడల్. భయపెట్టే సునామీపై మరోసారి అడ్వైజరీ జారీ అయింది. వివరాల్లోకి వెళితే.. అకస్మాత్తుగా కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం వచ్చింది. సెంట్రల్ అమెరికా దేశం హోండురస్‌కు ఉత్తరాన రిక్టర్‌స్కేల్‌పై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు గుర్తించారు. పశ్చిమ కరీబియన్ ప్రాంతంలో ఉన్న కేమన్ ఐలాండ్స్‌కు చెందిన జార్జ్ టౌన్ పరిధిలోని కరీబియన్ సముద్రంలో కూడా ఇంతే తీవ్రతతో భూకంపం వచ్చిందని వెల్లడైంది. కరీబియన్ సముద్రం మధ్య భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చిందని, దీని ఎఫెక్టు కొలంబియా, కోస్టారికా, నికరగువా, క్యూబా దేశాలపైనా పడిందని తెలిసింది.
Also Read :1000 Wala Movie : త్వరలో పేలనున్న 1000 వాలా.. మరో కొత్త హీరో..
భూకంప కేంద్రం అక్కడే..
సముద్ర గర్భంలో భారీ స్థాయిలో భూకంపం వచ్చినందున వెంటనే అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే సంస్థ అలర్ట్ అయింది. ప్యుయెర్టో రికో, యూఎస్ వర్జిన్ ఐలాండ్స్‌కు అది హుటాహుటిన సునామీ హెచ్చరికలను జారీ చేసింది. రాబోయే కొన్ని గంటల పాటు ఆయా తీర ప్రాంతాలు, బీచ్‌లలో ప్రజలు, పర్యాటకులు లేకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచనలు ఇచ్చింది. ఈ భూకంప కేంద్రం కేమన్ ఐలాండ్స్‌కు చెందిన జార్జ్ టౌన్ పరిధిలోని కరీబియన్ సముద్ర జలాల్లోనే ఉందని తెలిపింది. అమెరికా భూభాగానికి సునామీ ముప్పు లేదని స్పష్టం చేసింది. సునామీ(Tsunami) హెచ్చరికలతో కరీబియన్ దేశాలు, హోండురస్ కూడా అలర్ట్ అయ్యాయి. తీర ప్రాంతాలు, దీవుల్లో ఉంటున్న ప్రజలు వెంటనే ప్రధాన భూభాగానికి వచ్చేయాలని ప్రజలకు సూచించింది. రాబోయే కొన్ని గంటలపాటు బీచ్‌ల వైపునకు వెళ్లొద్దని కోరింది.