China Earthquake: చైనాలో భారీ భూకంపం

చైనాలోని గ్వాంగ్జీలో రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. లియుజౌ నగరంలో 7,000 మందికి పైగా నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూకంప ప్రభావిత నైరుతి ప్రాంతంలో గాలింపు, సహాయక చర్యలు ముగిశాయి. భూకంపం నేపథ్యంలో రవాణాకు అంతరాయం కలుగుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులను ఉటంకిస్తూ ప్రభుత్వ మీడియా జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం, శిథిలాల కింద చిక్కుకున్న 91 ఏళ్ళ వృద్దుడిని అధికారులు కాపాడారు. […]

Published By: HashtagU Telugu Desk
Massive Earthquake In China

Massive Earthquake In China

చైనాలోని గ్వాంగ్జీలో రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. లియుజౌ నగరంలో 7,000 మందికి పైగా నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూకంప ప్రభావిత నైరుతి ప్రాంతంలో గాలింపు, సహాయక చర్యలు ముగిశాయి. భూకంపం నేపథ్యంలో రవాణాకు అంతరాయం కలుగుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

అధికారులను ఉటంకిస్తూ ప్రభుత్వ మీడియా జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం, శిథిలాల కింద చిక్కుకున్న 91 ఏళ్ళ వృద్దుడిని అధికారులు కాపాడారు. ఇద్దరు మృతి చెందినట్లు జిన్హువా తెలిపింది. మృతులు 63 ఏళ్ళ పురుషుడు, 53 ఏళ్ళ మహిళ ఉన్నారు. వీరు దంపతులని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.

గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించింది. సోమవారం తెల్లవారుజామున లియుజైలో పదమూడంతస్తుల భవనాలు కూలిపోయాయి. భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఆయా ప్రాంతాలకు వెళ్ళే దారులు మూసుకుపోయాయి. ఎత్తైన భవనాల నుంచి ప్రజలు భయంతో బయటకు పరుగు తీయడం, ఇళ్ళు కూలిపోవడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.

  Last Updated: 18 May 2026, 04:46 PM IST