War Secrets : ‘మూడో ప్రపంచ యుద్ధం’ ఒకవేళ జరిగితే చాలా డేంజరస్‌గా ఉంటుంది. బూడిద కూడా మిగలదు. అంత పవర్ ఫుల్ అణ్వాయుధాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక అణ్వాయుధాలు రష్యా, అమెరికా దేశాల వద్ద రెడీగా ఉన్నాయి. చైనా, పాకిస్తాన్, భారత్ దగ్గర కూడా అణ్వస్త్రాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ తమతమ అణ్వాయుధాలను రహస్య న్యూక్లియర్ బంకర్లలో దాచి పెట్టాయి. అవి ఉన్న భారీ బందోబస్తు ఉంటుంది. ఈ బందోబస్తు విధుల కోసం ప్రత్యేక భద్రతా దళాలు ఉంటాయి. ఒకవేళ అణ్వాయుధాలను ప్రయోగించాలని డిసైడైతే.. అణ్వస్త్రాలను ప్రయోగించడానికి ప్రత్యేక టీమ్‌లు కూడా సిద్ధంగా ఉంటాయి. ఇదే విధంగా రష్యాలోని ఒక న్యూక్లియర్ బంకర్ వద్ద చాలాకాలం పాటు సెక్యూరిటీ విధులు నిర్వర్తించిన ఆంటోనే అనే సైనికుడు కొన్ని ‘న్యూక్లియర్’ సీక్రెట్స్ వెల్లడించాడు.
Also Read :Google Calendar : గూగుల్ క్యాలెండర్‌లో కొత్తగా ‘ఫుల్ స్క్రీన్’ ఫీచర్.. ఏమిటిది ?
రష్యా మాజీ సైనికుడు ఆంటోన్ కథనం ప్రకారం.. ‘‘ఉక్రెయిన్‌పై దండయాత్రను మొదలుపెట్టిన రోజే రష్యాలోని అణ్వాయుధాలను కూడా రెడీ చేశారు. అవసరమైతే వాటిని వాడాలని నిర్ణయించుకున్నారు’’ అని ఆయన చెప్పారు. ‘‘ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు.. మేం యుద్ధ విన్యాసాల టైంలో మాత్రమే అణ్వాయుధాలతో డ్రిల్స్ చేసే వాళ్లం. కానీ ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలయ్యాక మేం వాటితో డైరెక్టు ఎటాక్ చేసేందుకు రెడీ అయ్యాం. పై నుంచి అలాంటి ఆదేశాలు వచ్చాయి’’ అని ఆంటోన్ వివరించాడు. ‘‘ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలయ్యాక.. మొదటి మూడు వారాల పాటు అణ్వాయుధాల బంకర్లను తెరిచి రెడీ మోడ్‌లోనే ఉంచారు. వాటికి కాపలా కాసే మాకు ఎవ్వరికీ సెలవులు ఇవ్వలేదు’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.
Also Read :Nuclear Weapons : ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలిస్తే.. మీ అంతు చూస్తాం : రష్యా
‘‘రష్యా దగ్గర వేలాది అణ్వాయుధాలు ఉన్నాయి. అవి ఉన్న బంకర్లకు భద్రత కల్పించే వారికి భారీ జీతాలు ఉంటాయి. నేరుగా వెళ్లి యుద్ధంలో పాల్గొనాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే ఈ సిబ్బందికి అకస్మాత్తుగా లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. అణ్వాయుధాల రహస్యాలు బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తపడతారు’’ అని ఆంటోన్ చెప్పుకొచ్చాడు. ‘‘రష్యా అణ్వాయుధాలకు(War Secrets) సెక్యూరిటీ ఇచ్చే సిబ్బందికి సెలవులు ఈజీగా దొరకవు. సెలవుల కోసం కొన్ని నెలల ముందే పర్మిషన్ తీసుకోవాలి’’ అని అతడు తెలిపాడు. తనకు రష్యా సైన్యంలో ఎక్కువ కాలం పనిచేయడం ఇష్టం లేక.. దేశం నుంచి పారిపోయినట్లు తెలిపాడు. ప్రస్తుతం తాను రష్యా అవతల ఒక ఐరోపా దేశంలో ఉంటున్నట్లు ఆంటోన్ తెలిపాడు.