34 Dead: పడవ బోల్తా పడి 34 మంది జలసమాధి

వాయువ్య మడగాస్కర్‌ తీరం దగ్గర హిందూ సముద్రజలాల్లో శరణార్థుల పడవ బోల్తా పడి 34 మంది (34 Dead) జలసమాధి అయ్యారు.ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

  • Written By:
  • Publish Date - March 16, 2023 / 06:19 AM IST

వాయువ్య మడగాస్కర్‌ తీరం దగ్గర హిందూ సముద్రజలాల్లో శరణార్థుల పడవ బోల్తా పడి 34 మంది (34 Dead) జలసమాధి అయ్యారు.ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఫ్రాన్స్‌ ఆధీనంలోని మయోటే ద్వీపానికి చేరుకునేందుకు మడగాస్కర్‌ దేశంలోని అంబిలోబ్, తమ్తావే, మజుంగా ప్రాంతాలకు చెందిన 58 మంది శరణార్థులు ఒక పడవలో బయల్దేరినట్లు మడగాస్కర్‌ అధికారులు వెల్లడించారు.34 మంది మృతి చెందగా..మరో 24 మందిని అక్కడి మత్స్యకారులు రక్షించినట్లు తెలిపారు.

Also Read: MQ-9 REAPER: అమెరికా-రష్యాల మధ్య తీవ్ర స్థాయికి చేరుకున్న ఉద్రిక్తత.. అసలేం జరిగిందంటే?

హిందూ మహాసముద్రంలో వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడినట్లు మడగాస్కర్ అధికారులు బుధవారం తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 34 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. పడవలో 58 మంది ప్రయాణికులు ఉన్నారని, వారు సరైన అనుమతి లేకుండా మయోట్‌కు వెళ్తున్నారని అధికారులు చెప్పారు. శనివారం అర్థరాత్రి మడగాస్కర్ వాయువ్య తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ మునిగిపోయిందని మారిటైమ్ అథారిటీ అధికారులు తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు అంబిలోబ్, తమ్తావే, మజుంగా వాసులుగా ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన చెప్పారు.