Wildfires Vs Fish : కార్చిచ్చు అమెరికాలోని మహానగరం లాస్ ఏంజెల్స్‌ను కాల్చేసింది. దాదాపు 10 వేల కట్టడాలను బుగ్గి చేసింది. రూ.12.9 లక్షల కోట్ల ఆస్తి నష్టాన్ని సృష్టించింది. పదిమంది ప్రాణాలను బలిగొంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన బన్నీ(కుందేలు బొమ్మలు) మ్యూజియం కూడా ఈ మంటల్లో దగ్ధమైంది. ఈ మ్యూజియంలో కుందేళ్ల రూపంలో ఉన్న 46వేల వస్తువులు కాలిపోయాయి. లాస్ ఏంజెల్స్ పరిధిలోని పాలిసాడ్స్ ఫైర్, ఎటన్ ఫైర్ ప్రాంతాలలో దాదాపు 35 వేల ఎకరాల్లో అడవులు కాలిపోయాయి. కార్చిచ్చు దెబ్బకు ధనవంతులు, హాలీవుడ్ స్టార్లు వదిలేసి వెళ్లిపోయిన ఇళ్లల్లో దొంగలు పడుతున్నారు. దాదాపు 20 మంది దొంగలను ఇప్పటివరకు అరెస్టు చేశారు. లాస్ ఏంజెల్స్ నగరం ఎదుర్కొంటున్న ఈ దుస్థితికి కారణం ఒక చిన్నచేప అని చర్చ జరుగుతోంది ? ఆ వివరాలేంటో చూద్దాం..
Also Read :Ration Cards : రేషన్ కార్డులో క్రెడిట్ కార్డు తరహా ఫీచర్లు.. క్యూఆర్ కోడ్‌తో జారీ
‘డెల్టా స్మెల్ట్’ అనేది ఏటీఎం కార్డు సైజులో ఉండేే అరుదైన చేపజాతి. ఈ చేప జాతిని కాపాడటానికి కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ చేసిన మిస్టేక్ వల్లే లాస్ ఏంజెల్స్ నగరం కార్చిచ్చులో చిక్కుకుందని కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. డెల్టా స్మెల్ట్ జాతికి చెందిన చేపలు తక్కువ నీటిమట్టం ఉన్న జల వనరుల్లోనే జీవిస్తుంటాయి.