Jay Bhattacharya : మరో భారత సంతతి వ్యక్తికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కబోతోంది. పశ్చిమ బెంగాల్ మూలాలున్న జై భట్టాచార్యను అమెరికా ప్రభుత్వ ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్’ (ఎన్‌ఐహెచ్)కు కొత్త డైరెక్టర్‌గా నియమించాలని ట్రంప్ యోచిస్తున్నారు. ఎన్ఐహెచ్ అనేది అమెరికాలో జరిగే వైద్య పరిశోధనలను పర్యవేక్షిస్తుంటుంది. ఈ కీలకమైన సంస్థకు డైరెక్టర్ అయ్యేందుకు ముగ్గురు వ్యక్తులు పోటీపడుతుండగా.. ట్రంప్ మాత్రం జై భట్టాచార్య వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read :Special Trains : స్పెషల్ ట్రైన్లు.. ఎక్స్‌ట్రా ఛార్జ్.. ఎక్స్‌ట్రా లేట్
జనవరి 20న అమెరికాలో ఏర్పడబోయే ట్రంప్ ప్రభుత్వంలో రాబర్ట్ ఎఫ్ కెనడీ కీలక పాత్రను పోషించబోతున్నారు. ఆయనకు ముఖ్యమైన అమెరికా ఆర్థిక శాఖను ట్రంప్ కట్టబెట్టారు. ఇటీవలే రాబర్ట్ ఎఫ్ కెనడీతో జై భట్టాచార్య సమావేశమయ్యారు. ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్’ (ఎన్‌ఐహెచ్) వద్ద దాదాపు రూ.4 లక్షల కోట్ల నిధులు ఉన్నాయి. ఈ నిధుల సక్రమ వినియోగానికి సంబంధించి, భవిష్యత్ వైద్య పరిశోధనలపై తనకున్న విజన్‌ను రాబర్ట్ ఎఫ్ కెనడీ ఎదుట జై భట్టాచార్య వివరించారు. వైద్య పరిశోధనల విభాగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపైనా ఇరువురి మధ్య డిస్కషన్ జరిగిందని తెలిసింది. అమెరికా వైద్య విభాగం, ఔషధ కంపెనీలు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన వ్యూహం గురించి జై భట్టాచార్య(Jay Bhattacharya) వివరించినట్లు సమాచారం.
Also Read :Mosque Survey : ‘సంభల్’ మసీదు సర్వే.. పోలీసుల లాఠీఛార్జి.. నిరసనకారుల రాళ్లదాడి
ట్రంప్ ప్రభుత్వం అమెరికాలోని అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్నందున.. ఎప్పటి నుంచో ఆ సంస్థలో పాతుకుపోయిన పాతవారి పట్టు తొలగించాలని ఆయన సిఫారసు చేసినట్లు తెలిసింది. అదే సమయంలో ఎన్‌ఐహెచ్‌లో సరికొత్త పోకడలను ప్రోత్సహించాలని రాబర్ట్ ఎఫ్ కెనడీని జై భట్టాచార్య కోరినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రస్తుతం అమెరికాలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకానమిక్స్ రీసెర్ఛ్‌లోనూ రీసెర్చ్ అసోసియేట్‌గా జై భట్టాచార్య ఉన్నారు. అందుకే అమెరికా ఆర్థిక, వాణిజ్య రంగాలతో ముడిపడిన అంశాలపై కెనడీకి కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. ఈ ప్రజెంటేషన్‌పై కెనడీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఇక జై భట్టాచార్య కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో హెల్త్ పాలసీ విభాగం ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు.