Kim Jong Un: ఉత్తర కొరియాలో పెరుగుతున్న ఆత్మహత్యల పట్ల నియంత కిమ్ జోంగ్-ఉన్ (Kim Jong Un) కూడా ఆందోళన చెందుతున్నారు. కిమ్ (Kim Jong Un) దేశంలో ఆత్మహత్యలను నిషేధించాలని రహస్య ఉత్తర్వులు జారీ చేశారు. రేడియో ఫ్రీ ఆసియాతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాన్ని ఒక అధికారి ధృవీకరించారు. ఎన్‌డిటివి నివేదిక ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ తన ఆర్డర్‌లో ఆత్మహత్యను ‘సోషలిజానికి వ్యతిరేకంగా రాజద్రోహం’గా అభివర్ణించారు.
నియంత పాలనలో ఆత్మహత్యల నివారణ బాధ్యతలను అధికారులకు అప్పగించారు. ఆత్మహత్య కేసు వెలుగులోకి వస్తే స్థానిక ప్రభుత్వ అధికారులు ‘జవాబుదారు’గా ఉంటారు. తమ పరిధిలోని వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా అడ్డుకోవడంలో విఫలమైతే స్థానిక అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని కిమ్ పేర్కొన్నారు. నివేదిక ప్రకారం.. ఈ ఆర్డర్‌ను పాస్ చేయడానికి ముందు కిమ్ జోంగ్-ఉన్ అత్యవసర సమావేశాన్ని కూడా నిర్వహించారు.
కిమ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు
ఈ విషయంపై కిమ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రావిన్షియల్ పార్టీ కమిటీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగిందని, పలువురు ప్రముఖ నాయకులు హాజరయ్యారని, ఈశాన్య ప్రావిన్స్ నార్త్ హమ్‌యోంగ్‌కు చెందిన ఒక అధికారిని ఉటంకిస్తూ రేడియో ఫ్రీ ఆసియా పేర్కొంది. ఈ సమావేశంలో కిమ్ జోంగ్ ఉన్ ఆత్మహత్యలపై నిషేధం విధించారు. నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం చోంగ్‌జిన్ సమీపంలోని క్యోంగ్‌సాంగ్ కౌంటీలో మాత్రమే 35 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఉత్తర హమ్‌గ్యోంగ్‌పై కూడా సమావేశంలో చర్చించారు.
నివేదిక ప్రకారం.. ఆకలితో మరణించిన వారి ఖచ్చితమైన సంఖ్య ఇంకా వెల్లడి కాలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఈ గణాంకాలను గోప్యంగా ఉంచింది. ఇంటెలిజెన్స్ విభాగం అంచనా ప్రకారం గతేడాదితో పోలిస్తే ఉత్తర కొరియాలో ఆత్మహత్యలు దాదాపు 40 శాతం పెరిగాయని ఆయన చెప్పారు. ర్యాంగాంగ్ ప్రావిన్స్‌లో ఆకలి చావుల కంటే ఆత్మహత్యలు పెరిగిపోయాయి. కిమ్ ఆదేశాలైతే జారీ చేశారు. కానీ ఎలా అడ్డుకోవాలనే ప్రణాళికలు మాత్రం అధికారుల వద్ద లేవని ఆర్‌ఎఫ్‌ఏ పేర్కొంది. ఉత్తరకొరియాలో అత్యధిక మంది పేదరికం, ఆకలి కారణంగానే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.