Site icon HashtagU Telugu

Kenya violence: కెన్యాలో ఉద్రిక్త ప‌రిస్థితులు.. భార‌తీయులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచన..!

Kenya violence

Kenya violence

Kenya violence: ఆఫ్రికా దేశం కెన్యాలో హింస (Kenya violence) ఆగడం లేదు. కెన్యా రాజధాని నైరోబీతో పాటు పలు నగరాల్లో హింసాత్మక నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు కెన్యాలో నివసిస్తున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని భారత హైకమిషన్ సలహా ఇచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సోదరి ఔమా ఒబామా కూడా కెన్యా పోలీసుల చర్యకు బాధితురాలిగా మారింది.

బరాక్ ఒబామా సోదరి కూడా నిరసనకారులలో ఉన్నారు

కెన్యాలో జరిగిన ఈ హింసలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సోదరి ఔమా ఒబామా కూడా భాగమ‌య్యారు. కెన్యా పార్లమెంట్ భవనం వెలుపల నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఔమా నిరసన తెలిపారు. ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని ఔమా ఒబామా చెప్పారు. దీంతో వారిపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.

Also Read: MLC Jeevan Reddy: ఢిల్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి .. సోనియా పిలుపు

అధ్యక్షుడు రూటో ఒక ప్రకటన ఇచ్చారు

ఈ హింసాకాండను కెన్యా అధ్యక్షుడు విలియం రూటో తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి హింస ప్రజాస్వామ్యంపై దాడి అని ఆయన ఎక్స్ వేదికపై రాశారు. ప్రపంచం ఈ నిర‌స‌న‌ను గమనిస్తోంది. ఈ హింసకు కారణమైన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకుంటున్నామ‌ని రాసుకొచ్చారు.

We’re now on WhatsApp : Click to Join

భారత హైకమిషన్ హెచ్చరించింది

X ప్లాట్‌ఫారమ్‌లో ట్వీట్‌ను పంచుకుంటూ.. కెన్యాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని, ఏ పని లేకుండా బయటకు వెళ్లవద్దని సూచించారని భారత హైకమిషన్ రాసింది. కెన్యాలో శాంతి పునరుద్ధరించే వరకు హింసాత్మక ప్రదేశాలకు దూరంగా ఉండండి. అన్ని ప్రధాన అప్డేట్‌ల‌ కోసం సోషల్ మీడియా, వార్తల వెబ్‌సైట్‌లకు కనెక్ట్ అయి ఉండండని సూచించారు. గణాంకాల ప్రకారం.. కెన్యాలో సుమారు 20 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. వారు హింసాత్మక ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు.

అసలు విషయం ఏమిటి?

నైరోబీలోని పార్లమెంట్ హౌస్‌లో బిల్లులు ఆమోదిస్తారు. అయితే, పన్నుల పెంపునకు సంబంధించిన ఓ బిల్లు ఉనికిలోకి రాకముందే వివాదాలు చుట్టుముట్టాయి. బిల్లును వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనకారులు పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు కాల్పులు ప్రారంభించారు. ఇందులో 5 మంది నిరసనకారులు మరణించారు. హింసను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను కూడా ప్రయోగించారు. అయితే అప్పటికి పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసుల చర్యతో ఆగ్రహించిన ఆందోళనకారులు పార్లమెంట్‌కు నిప్పు పెట్టారు.