Site icon HashtagU Telugu

Kamala Harris Husband Comments : కమలను డిబేట్‌లో ఓడించడం అసాధ్యం.. భర్త డగ్లస్‌ కామెంట్స్

Kamala Harris Husband

Kamala Harris Husband Comments : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ దూసుకుపోతున్నారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమెకు అమెరికాలోని చాలా రాష్ట్రాలలో మంచి మద్దతు లభిస్తోంది. ఈనెల 10న రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో కమలా హ్యారిస్ ఏబీసీ న్యూస్ ఛానల్ వేదికగా లైవ్ డిబేట్‌కు రెడీ అవుతున్నారు.ఈ తరుణంలో కమలా హ్యారిస్ భర్త  డగ్లస్‌ ఎమ్‌హోఫ్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Also Read :Terror Attack Plot : న్యూయార్క్‌‌లో యూదులపై ఉగ్రదాడికి స్కెచ్.. పాకిస్తానీయుడి అరెస్ట్

‘‘నా భార్య స్వతహాగా గొప్ప లాయర్. నేను కూడా లాయర్‌నే. ఆమెతో జరిగిన అన్ని డిబేట్లలో నేను ఎన్నడూ గెలవలేదు. కమలను డిబేట్‌లో ఓడించడం చాలా కష్టం. మా ఇద్దరి కెరీర్ న్యాయవాదులుగానే మొదలైంది. కమల శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా,  కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలు అందించారు. ఈనెల 10న ట్రంప్‌తో జరిగే డిబేట్‌లో కమల సత్తా చాటడం ఖాయం. ఆమె వాదనా పటిమ అనన్య సామాన్యం’’ అని కమలా హ్యారిస్ భర్త డగ్లస్‌ ఎమ్‌హోఫ్‌(Kamala Harris Husband Comments) వ్యాఖ్యానించారు.

Also Read :Brij Bhushans First Reaction : వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా : బ్రిజ్ భూషణ్

ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలా హ్యారిస్ ఆగస్టులో 30 లక్షల మంది దాతల నుంచి దాదాపు 36.1 కోట్ల డాలర్ల విరాళాలను కూడగట్టారు. ఈనెలలో న్యూయార్క్‌, అట్లాంటా, లాస్‌ ఏంజిల్స్‌, శాన్‌ ఫ్రాన్సిస్కోలలో మరిన్ని ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు కమల అండ్ టీమ్ రెడీ అవుతోంది. అయితే ఆగస్టు నెలలో కమలా హ్యారిస్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌‌కు కేవలం 13 కోట్ల డాలర్ల విరాళాలే వచ్చాయి. ప్రస్తుతం అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా అధికారంలో ఉండటం అనేది కమలా హ్యారిస్‌కు కలిసొచ్చి విరాళాలు ఎక్కువగా వచ్చాయని తెలుస్తోంది. అధికారంలో ఉన్న అడ్వాంటేజ్ వల్ల కొన్ని రాష్ట్రాల్లో సహజంగానే ఆమెకు మంచి పట్టు దొరికింది. ఆయా రాష్ట్రాల డెమొక్రటిక్ పార్టీ ప్రజాప్రతినిధులంతా కమలా హ్యారిస్ ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటున్నారు.