Diwali 2024 : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో 600 మందికిపైగా ప్రముఖ భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. ఈసందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ బైడెన్ ఒక సందేశాన్ని విడుదల చేశారు.
Also Read :Nutrition Tips : ఉదయాన్నే బెడ్ మీద కాఫీ తాగి ఆరోగ్యం పాడవకుండా ఇవి తింటే చాలా మంచిది
‘‘అమెరికా అధ్యక్షుడిగా వైట్ హౌస్‌లో దీపావళి(Diwali 2024) వేడుకలను నిర్వహించినందుకు నాకు గౌరవంగా ఉంది. ఇది నాకు చాలా గొప్ప విషయం. నా టీమ్‌లోని ఎంతోమంది వైస్ ప్రెసిడెంట్, సెనేటర్లు దక్షిణాసియా అమెరికన్లే’’ అని బైడెన్ చెప్పారు. ‘‘కమలా హ్యారిస్ నుంచి డాక్టర్ మూర్తి వరకు మీలో చాలా మంది ఈరోజు ఇక్కడ ఉన్నారు. నిబద్ధతగా అమెరికాకు సేవలు అందించినందుకు నేను గర్వపడుతున్నాను’’ అని బైడెన్ తెలిపారు. బైడెన్ కంటే ముందు భారతీయ అమెరికన్ యువ కార్యకర్త శ్రుస్తి అముల, వైస్ అడ్మిరల్ వివేక్ హెచ్.మూర్తి (అమెరికా సర్జన్ జనరల్) ప్రసంగించారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, అధ్యక్షుడు బైడెన్ సతీమణి జిల్ బైడెన్ డెమొక్రటిక్ పార్టీ ఎన్నికల ప్రచారం కారణంగా వైట్‌హౌస్‌లో జరిగిన దీపావళి వేడుకలకు గైర్హాజరయ్యారు.
Also Read :13 IAS Officers Transfer : తెలంగాణ లో 13 మంది ఐఏఎస్‌లు బదిలీ
సునితా విలియమ్స్ ఏమన్నారంటే..
భూమికి 418 కి.మీ దూరంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి నాసా వ్యోమగామి సునితా విలియమ్స్ దీపావళి సందేశాన్ని పంపారు. ‘‘మా నాన్న మాకు హిందూ కల్చర్ గురించి నిత్యం చెబుతూ ఉండేవారు. కల్చరల్ వారసత్వాన్ని కాపాడమని ఆయన చెప్పేవారు. మా కుటుంబం ఏటా దీపావళితో పాటు అన్ని భారతీయ పండుగలను ఘనంగా జరుపుకుంటుంది’’ అని సునిత చెప్పారు. వైట్‌హౌస్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా దీపావళి వేడుకలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆమె ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ ప్రపంచ అగ్రశక్తిగా వెలుగొందుతోందని సునిత పేర్కొన్నారు.