Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ యువకులు

సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు కల్పిస్తామని మోసపూరితంగా రష్యాకు పంపిన స్థానిక ఏజెంట్ల బారిన పడి తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులతో సహా డజనుకు పైగా భారతీయులు రష్యా-ఉక్రెయిన్ వార్ లో చిక్కుకుపోయారు.

Russia-Ukraine War: సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు కల్పిస్తామని మోసపూరితంగా రష్యాకు పంపిన స్థానిక ఏజెంట్ల బారిన పడి తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులతో సహా డజనుకు పైగా భారతీయులు రష్యా-ఉక్రెయిన్ వార్ లో చిక్కుకుపోయారు. బదులుగ వారందరూ కొనసాగుతున్న యుద్ధంలో పాల్గొనడానికి వారికు ఆయుధాలు ఇచ్చి పంపారు. యుద్ధంలో పాల్గొన్న ఇండియన్స్ లో కొందరికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో ఒకారు మృతి చెందినట్లు నివేదికలు చెప్తున్నాయి.

ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జనవరి 25న ఈ విషయాన్నీ వెలుగులోకి తెచ్చారు. ముగ్గురు హైదరాబాద్ యువకుల కోసం తక్షణమే సహాయం చేయాలని కోరుతూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మరియు మాస్కోలోని భారత రాయబారి రాయబారిని ఉద్దేశించి లేఖలు రాశారు. మొదట్లో ఉద్యోగావకాశాల కోసం రష్యాకు వెళ్లినప్పుడు వారు భారతీయ ఏజెంట్లచే తప్పుదారి పట్టించి రష్యా ప్రైవేట్ సైన్యంలో చేరడానికి బలవంతం చేశారని పేర్కొన్నారు. 25 రోజులుగా వారితో ఎలాంటి సంబంధాలు లేకపోవడంతో ఆ యువకుల కుటుంబాలు అవస్థలు పడ్డాయి.

అస్ఫాన్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కాగా, అర్బాబ్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడు, జహూర్ జమ్మూ కాశ్మీర్‌కు చెందినవాడు, మరో యువకుడు హేమల్ గుజరాత్‌కు చెందినవాడు. ఈ విషయంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి ఎటువంటి స్పందన రానప్పటికీ, రష్యా నుండి తమ పిల్లలు సురక్షితంగా తిరిగి రావడానికి సహాయం కోరుతూ మరో నాలుగు కుటుంబాలు అసదుద్దీన్ ఒవైసీకి మంగళవారం లేఖలు రాశాయి.

తల్లిదండ్రుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని కలబురగికి చెందిన సయ్యద్‌ ఇలియాస్‌ హుస్సేనీ, మహ్మద్‌ సమీర్‌ అహ్మద్‌, అబ్దుల్‌ నయీం, తెలంగాణకు చెందిన మహ్మద్‌ సుఫియాన్‌తో కలిసి ఉద్యోగ అవకాశాల కోసం డిసెంబర్‌ 18, 2023న టూరిస్ట్‌ వీసాపై రష్యా వెళ్లారు. బాబా వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న మహారాష్ట్రకు చెందిన ఫైసల్ ఖాన్ అనే ఏజెంట్ రష్యాలో సెక్యూరిటీ/హెల్పర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని తప్పుడు వాగ్దానం చేశారని వారు ఆరోపించారు. ఆ యువకులను సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ కేసును సానుభూతితో పరిగణించి, ఒంటరిగా యువకులను వారి కుటుంబాలకు అప్పజెప్పాలని కోరాడు.

Also Read: Vijayawada : విజ‌య‌వాడ వెస్ట్‌లో టీడీపీకి బిగ్ షాక్‌.. వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే..!