Shocking: ఇటలీలో ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నతరహా అల్ట్రాలైట్ విమానం హైవేపై కుప్పకూలడంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం బ్రెసికా నగరానికి సమీపంలోని ఒక హైవేపై చోటుచేసుకోవడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ప్రమాదం తరువాత విమానం మంటలు అంటుకుని కాలిపోయింది.
విమానయాన నిపుణుల అంచనా ప్రకారం, ప్రమాదానికి ప్రధాన కారణం విమానం నియంత్రణ తప్పడమే కావచ్చు. పైలట్ అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నం చేస్తున్న సమయంలో విమానం ఆకస్మికంగా ‘నోస్‌డైవ్’ అయ్యి హైవేపై బలంగా ఢీకొట్టినట్లు భావిస్తున్నారు. ఢీకొన్న క్షణంలోనే విమానం భారీ మంటల్లో చిక్కుకోవడంతో పైలట్ సహా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
Singapore : సింగపూర్ లో పాట పాడితే జైలుకే..!! ఇంకెన్ని రూల్స్ ఉన్నాయో తెలుసా…?
‘ఫ్రేషియా ఆర్జీ’ మోడల్ అల్ట్రాలైట్ విమానాన్ని కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. ఈ విమానానికి సుమారు 30 అడుగుల వింగ్ వెడల్పు ఉంది. హైవేపై వేగంగా దూసుకెళ్లి ఢీకొనడం సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా రికార్డయింది. విమానం పేలిన క్షణంలో హైవేపై వెళ్తున్న ఇద్దరు బైకర్లు కూడా గాయపడ్డారు. వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం చోటుచేసుకున్న వెంటనే అత్యవసర సిబ్బంది, అగ్నిమాపక దళం ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల అసలు కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
‘ఫ్రేషియా ఆర్జీ’ మోడల్ అల్ట్రాలైట్ విమానాలు సాధారణంగా రెండు సీట్ల సామర్థ్యంతో, తేలికపాటి నిర్మాణంతో ఉంటాయి. వీటిని వ్యక్తిగత ప్రయాణాలకు, హాబీ ఫ్లైట్స్‌కు ఎక్కువగా వినియోగిస్తారు. ఈ విమానం వేగవంతమైనదిగా, కానీ చిన్న పరిమాణం కారణంగా ప్రతికూల వాతావరణం లేదా సాంకేతిక లోపాలు వస్తే సులభంగా నియంత్రణ తప్పే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
India vs England: పటిష్ట స్థితిలో ఇంగ్లాండ్.. మూడో ఆట ముగిసే సమయానికి స్కోర్ ఎంతంటే?