Italy PM Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Italy PM Meloni) తన భాగస్వామితో విడిపోయారు. దాదాపు దశాబ్ద కాలం పాటు కలిసి ఉన్న తర్వాత తన భాగస్వామి నుంచి విడిపోతున్నట్లు శుక్రవారం ఆమె ప్రకటించింది. మెలోనికి తన భాగస్వామితో ఒక కుమార్తె కూడా ఉంది. ఆండ్రియా గియాంబ్రూనోతో తన సంబంధం ఇక్కడితో ముగిసిందని మెలోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
ఆండ్రియాతో నా సంబంధం ముగిసింది
సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో మెలోని (ఇటలీ PM జార్జియా మెలోని) ఆండ్రియా జియాంబ్రూనోతో తన సంబంధం ముగిసిందని చెప్పారు. కొంతకాలం క్రితమే తమ దారులు విడిపోయాయని అన్నారు. టెలివిజన్ వ్యక్తి జియాంబ్రూనో సహచరులకు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఆడియోలో పట్టుబడిన తర్వాత ఈ ప్రకటన చేసింది మెలోని.
We’re now on WhatsApp. Click to Join.
ఆండ్రియా ఎవరు, అసభ్యకరమైన వ్యాఖ్య ఏమిటి..?
ఇటాలియన్ PM మెలోని భాగస్వామి ఆండ్రియా జియాంబ్రూనో వృత్తిరీత్యా జర్నలిస్ట్. అతను టీవీలో బాగా తెలిసిన ముఖం. ఆండ్రియా తన ఒక కార్యక్రమంలో అత్యాచార బాధితురాలిపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒక కార్యక్రమంలో ఆండ్రియా అత్యాచార బాధితురాలిపై చాలా ప్రశ్నలు లేవనెత్తాడు. అలాగే ఒక మహిళా సహోద్యోగిపై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
మెలోనీ.. ఆండ్రియాకు ధన్యవాదాలు తెలిపారు
మెలోనీ పోస్ట్ లో ర్ విధంగా రాశారు. మేము కలిసి గడిపిన అద్భుతమైన సంవత్సరాలకు గాను నేను అతనికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఎదుర్కొన్న అన్ని కష్టాలలో నాతో ఉన్నందుకు, నా జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం మా కుమార్తె జెనీవ్రాను అందించినందుకు నేను అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొంది.
జార్జియా మెలోని ఇటలీకి మొదటి మహిళా ప్రధానమంత్రి, మితవాద పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ నాయకురాలు. మెలోని భాగస్వామి ఆండ్రియా గియాంబ్రూనోను 2015లో ఒక టీవీ షోలో కలిశారు. ఆ తర్వాత ఇద్దరూ క్రమంగా దగ్గరవుతూ లివ్‌ఇన్‌లో జీవించడం ప్రారంభించారు. వారిద్దరికీ ఏడేళ్ల కూతురు జెనీవ్రా కూడా ఉంది.