Site icon HashtagU Telugu

S*X Rooms : జైళ్లలో ఖైదీల కోసం ప్రత్యేక ‘శృంగార గదులు’

Italy Opens Its First 'se R

Italy Opens Its First 'se R

ఇటలీ ప్రభుత్వం (Italy Govt) ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ఖైదీల వ్యక్తిగత జీవన హక్కులను గౌరవిస్తూ, జైళ్ల(Jail )లో ప్రత్యేకంగా ‘శృంగార గదులు’ (Italy’s first-ever s*x room for prisoners ) ఏర్పాటు చేయడం మొదలుపెట్టింది. ఖైదీలు తమ భార్యలు లేదా భాగస్వాములతో గడిపేందుకు వీలుగా ఈ గదులు ఏర్పాటు చేయబడ్డాయి. మొదటగా ఉంబ్రియా ప్రాంతంలోని ఒక జైల్లో ఈ విధానం అమలులోకి వచ్చింది. ఇది ఖైదీల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా ఒక సానుకూలమైన చర్యగా భావిస్తున్నారు.

Suriya Emotional: తండ్రి మాటలకు సూర్య ఎమోషనల్‌.. రియాక్షన్ ఇదీ

ఈ గదుల్లో ఖైదీలు తమ భాగస్వాములతో రెండుగంటలపాటు గడిపే అవకాశం పొందుతారు. ముఖ్యంగా ఈ గదుల్లో ఏవిధమైన సెక్యూరిటీ పర్యవేక్షణ ఉండదు. ఇది ఖైదీల గౌరవం, గోప్యతను కాపాడే విధంగా రూపొందించబడింది. ఇటలీ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఖైదీలకు వారి భాగస్వాములతో శృంగార కలయిక సాధించేందుకు హక్కు ఉన్నదని పేర్కొంది. దీని ద్వారా ఖైదీలు వారి కుటుంబ సంబంధాలను బలపర్చుకునే అవకాశం పొందుతారు.

Guava Leaves: షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ ఆకు దివ్య ఔషధం.. ఒక్క ఆకుతో షుగర్ కంట్రోల్ అవ్వడం ఖాయం!

ఈ నిర్ణయాన్ని ఇటలీలోని మానవ హక్కుల కార్యకర్తలు, సామాజిక నిపుణులు స్వాగతిస్తున్నారు. ఇది ఖైదీల పునరావాసానికి, వారి మానసిక స్థిరత్వానికి దోహదపడే చర్యగా పరిగణిస్తున్నారు. ఇతర యూరోపియన్ దేశాలలోనూ ఇటలీ విధానం ప్రేరణగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జైలు జీవితం కఠినమైనదే అయినా, ఇందులో మానవీయతకు చోటు ఉండాలని ఈ చర్య ద్వారా ప్రభుత్వం చూపించింది.