Masood Azhar : మసూద్ అజార్ కరుడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాది. జైషే మహ్మద్ పేరుతో ఒక ఉగ్రవాద సంస్థను నడుపుతున్నాడు. ఇతగాడు భారత్‌లో ఎన్నో ఉగ్రదాడులు చేయించి ఎంతోమంది భారతీయుల ప్రాణాలను బలిగొన్నాడు. ఈ ఉగ్రవాదికి భారత్ తన సత్తా ఏంటో చూపించింది. మసూద్ అజార్ రక్త కన్నీరుతో ఏడ్చే పరిస్థితిని భారత సైన్యం క్రియేట్ చేసింది. బుధవారం తెల్లవారుజామున 1 గంటలకు భారత ఆర్మీ నిర్వహించి ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్‌కు భారీ నష్టం కలిగింది. భారత ఆర్మీ అతడికి మానసికంగా కోలుకోలేనంత దెబ్బ కొట్టింది. భారత ఆర్మీ క్షిపణి దాడుల్లో 14 మంది మసూద్ అజార్ కుటుంబ సభ్యులు హతమయ్యారు. చనిపోయిన మసూద్ అజార్ కుటుంబీకుల్లో ఐదుగురు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న బహావల్‌పూర్‌లో జామియా మస్జిద్ సుబహానల్లా ఉంది. దీన్ని మసూద్ అజార్ కుటుంబం ఉగ్రవాద స్థావరంగా వాడుకుంటోంది. ఈ మసీదులోనే ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తోంది. అందుకే దీనిపై భారత ఆర్మీ ఎటాక్ చేసింది. ఈ దాడిలోనే 14 మంది మసూద్ అజార్ కుటుంబీకులు చనిపోయారు. ఈవివరాలను ధ్రువీకరిస్తూ స్వయంగా మసూద్ అజార్ ఒక ప్రకటన విడుదల చేశాడు. ఆ వివరాలు చూద్దాం..
Also Read :Pakistan Airspace : ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు పాక్ ఎయిర్‌స్పేస్ ఖాళీ
మసూద్ అజార్ ప్రకటన ఇదీ..
‘‘నా కుటుంబంలోని 14 మంది సభ్యులు ఈ రాత్రి అమరులయ్యే అదృష్టాన్ని పొందారు. ఐదుగురు అమాయక పిల్లలు చనిపోయి, జన్నతుల్ ఫిర్దౌస్‌లో పువ్వులుగా మారారు. నా అక్క సాహిబా నా ప్రాణం కంటే ప్రియమైంది. నా అక్క భర్త, నా మేనల్లుడు అలీమ్ ఫాజిల్, అతడి భార్య, నా ప్రియమైన మేనకోడలు ఆలం ఫాజిలా, మా మేనల్లుడు, అతడి భార్య అల్లాహ్‌కు ప్రియమైనవారు అయ్యారు’’ అని మసూద్ అజార్ పేర్కొన్నాడు. తాను గతంలో ఉగ్రదాడులు జరిపించి అమాయక భారతీయుల ప్రాణాలు తీయించిన విషయాన్ని మర్చిపోయి మసూద్ అజార్(Masood Azhar) నీతులు వల్లించాడు.
స్వర్గస్తులు అయ్యారంటూ నీతులు..
‘‘అమాయక పిల్లలు, బురఖా ధరించిన మహిళలు, వయసు మీద పడిన ముసలి వారిని మోడీ టార్గెట్ చేశారు. ఈ బాధ గురించి నేను మాటల్లో చెప్పలేను. భరించలేనంత బాధను ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అయినా పశ్చాత్తాపం లేదు. బాధ లేదు. భయం లేదు. చనిపోయిన నా 14 మంది కుటుంబీకుల్లో నేను కూడా ఉండి ఉంటే బాగుండేదని నా మైండ్‌లో పదేపదే వస్తోంది. అయితే అల్లాతో మనం కలిసే టైం ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. అది ముందు రాదు, వెనుక రాదు. మా ఇంట్లో మొత్తం నలుగురు పిల్లలు ఉండేవారు. వాళ్లంతా మూడేళ్ల నుంచి ఏడేళ్లలోపువారు. వాళ్లంతా కలిసి స్వర్గస్తులయ్యారు. అల్లా ప్రేమించే వారికే అమరత్వం లభిస్తుందని ఖురాన్ చెబుతోంది. వాళ్ల సమయం వచ్చింది కాబట్టే వాళ్లు వెళ్లిపోయారు. మోడీ క్రూరత్వం అన్ని రకాలుగా హద్దులు దాటింది. ఆయన ఎవరినీ వదిలిపెట్టడం లేదు’’ అని మసూద్ అజార్ వ్యాఖ్యలు చేశాడు.