Site icon HashtagU Telugu

Iran-Israel: ఖొమేనీని వదిలిపెట్టబోం.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Katz

Katz

Iran-Israel: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నిత్యం పెరుగుతున్న నేపథ్యంలో, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. టెల్ అవీవ్ సమీపంలోని ఓ ఆసుపత్రిపై జరిగిన క్షిపణి దాడికి ప్రతిగా, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పిరికి నియంత ఖమేనీ బంకర్‌లో దాక్కుని ఆసుపత్రులపై దాడులు చేస్తున్నాడు. ఇది యుద్ధ నేరం. ఖమేనీ పాలన అంతమొందే రోజులు దరిచేరాయి. ఆయన భూమిపై ఇక జీవించబోయే పరిస్థితి లేదు,’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా హెచ్చరించారు.

Auto Tips : మీ పాత కారును అమ్మే బదులు, దానిని స్క్రాప్‌కు ఇచ్చి లాభం పొందండి.. ఎలా..?

ఈ వ్యాఖ్యలు ఆసుపత్రిపై జరిగిన క్షిపణి దాడి నేపథ్యంలో వచ్చాయి. ఈ దాడిలో కనీసం 47 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ సహాయ బృందాలు వెల్లడించాయి. ఈ దాడికి ప్రతిగా తాము ఇప్పటికే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌)కు టెహ్రాన్‌లోని ప్రభుత్వ, వ్యూహాత్మక లక్ష్యాలపై దాడుల తీవ్రత పెంచాలంటూ ఆదేశించామని కాట్జ్ తెలిపారు. ఇకపోతే, ఇరాన్ మాత్రం ఆసుపత్రి లక్ష్యం కాదని ఖండిస్తోంది. తమ దాడి లక్ష్యం సమీపంలోని ఇజ్రాయెల్ సైనిక స్థావరమని, ఆసుపత్రికి కేవలం పేలుడు తరంగాల ప్రభావం మాత్రమే తగిలిందని ఇరాన్ వార్తా సంస్థ IRNA వెల్లడించింది.

ఇక ఇరువైపుల దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో తీవ్ర పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో పలువురు సీనియర్ ఇరాన్ సైనికాధికారులు, అణు శాస్త్రవేత్తలు మృతిచెందినట్లు సమాచారం. టెహ్రాన్‌లోని 50కి పైగా వ్యూహాత్మక లక్ష్యాలు ధ్వంసమైనట్లు సమాచారం అందుతోంది. ఈ పరిణామాలపై స్పందించిన ఖమేనీ, ‘‘ఇరాన్ ఎప్పటికీ లొంగదు. బెదిరింపులకు భయపడదు. అమెరికా జోక్యం చేస్తే అది భారీ పరిణామాలకు దారితీస్తుంది,’’ అంటూ స్పష్టం చేశారు.

Mahesh Vanity Van : మహేష్ కొత్తగా కొనుగోలు చేసిన వ్యానిటీ వ్యాన్..ఖరీదు ఎంతో తెలుసా..?