Benjamin Netanyahu : పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీసుకున్న తాజా నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆయన రక్షణశాఖ మంత్రి యోవ్ గాలంట్‌ను పదవీ నుంచి తప్పించి, కొత్త నిర్ణయాన్ని ప్రకటించారు. గత ఏడాది అక్టోబర్‌లో గాజాలో యుద్ధం ప్రారంభం కావడంతో నెతన్యాహు , గాలంట్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ సమయంలో గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలపై రెండు వైపులా అభిప్రాయ భేదాలు చోటుచేసుకున్నాయి. అయితే, ఇంతవరకు గాలంట్‌పై ఎలాంటి చర్యలు తీసుకోని నెతన్యాహు, మంగళవారం అర్ధరాత్రి ఈ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు.
“యుద్ధ సమయంలో ప్రధాని, రక్షణశాఖ మంత్రి మధ్య పూర్తి నమ్మకం అవసరం. మొదట్లో ఉన్న నమ్మకం ఇప్పుడు లేని పరిస్థితి ఉంది. ఈ నమ్మకం క్షీణించింది, ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి,” అని నెతన్యాహు చెప్పారు. ఈ నిర్ణయం ప్రకారం, గాలంట్ స్థానంలో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్‌ను నియమించనున్నారు. తాజా మంత్రివర్గ మార్పుల్లో, విదేశాంగ శాఖ బాధ్యతలు గిడియాన్ సార్‌కు అప్పగించారు.
గాలంట్‌ను పదవి నుంచి తొలగించాలనుకుని నెతన్యాహు గత మార్చిలో కూడా ప్రయత్నించారు. అయితే, ఆ సమయంలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తి, నెతన్యాహు వెనక్కి తగ్గారు. గాలంట్, న్యాయవ్యవస్థలో మార్పుల కోసం తీసుకొచ్చిన నెతన్యాహు చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత, నెతన్యాహు గాలంట్‌ను మంత్రి వర్గం నుంచి తొలగిస్తే, ఆయన మాట్లాడుతూ “ఇజ్రాయెల్ భద్రత నా జీవిత లక్ష్యం” అని తెలిపారు.
ఇక, హమాస్‌తో కొనసాగుతున్న యుద్ధం ఇప్పటి వరకూ 43,391 మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా. ఇందులో ఎక్కువ శాతం సాధారణ పౌరులు కావడం అత్యంత విచారకరం. ఈ నేపథ్యంలో, గాజాతో పాటు లెబనాన్‌లోని హెజ్బొల్లాపై కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతోంది. మంగళవారం, గాజా , లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక , భూతల దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో ఒకరు మరణించగా, 20 మంది గాయపడ్డారు. ఈ దాడులు దక్షిణ లెబనాన్ , బేకన్ లోయలోనూ జరిగాయి.
Read Also : Eating Healthy Day : జాతీయ ఆహార దినోత్సవాన్ని ఈ విధంగా జరుపుకోండి, ఆరోగ్యంగా ఉండండి..!