Iran-israel : ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో, ప్రపంచ దేశాలు సీరియస్‌గా స్పందించాయి. తాజాగా, ఆదివారం ఉదయం అమెరికా విరుచుకుపడి, ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై గాలిదాడులు నిర్వహించింది. ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ పరిణామాల నేపథ్యంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ , నూతనంగా ఎన్నికైన ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. మోదీ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ, “ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులపై ఇరాన్ అధ్యక్షుడితో చర్చించాం. నేను శాంతిని పునరుద్ధరించే ఆవశ్యకతను గుర్తుచేశాను. ప్రాంతీయ స్థిరత్వం, భద్రత చాలా ముఖ్యం” అని పేర్కొన్నారు.
Iran-Israel : ఇజ్రాయెల్‌పై మరోసారి ఇరాన్ దాడులు
ఇక ఇదే సందర్భంగా, ఇరాన్‌పై అమెరికా బాంబు దాడులపై బహిష్కృత ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ రెజా షా పహ్లవి స్పందించారు. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లపై జరిగిన దాడులు – ఇస్లామిక్ రిపబ్లిక్ అణ్వాయుధాలపై పట్టుదల కారణమని తెలిపారు. ఖమేనీ నాయకత్వాన్ని “ఉగ్రవాద పాలన”గా అభివర్ణించిన పహ్లవి, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
“ఇరాన్ ప్రజల ప్రయోజనాల కోసం ఖమేనీ తప్పుకోవాలి. అప్పుడే దేశం శాంతి, శ్రేయస్సు మార్గంలో ముందుకెళ్లగలదు,” అని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దాడులు విజయవంతమని వెల్లడించగా, ప్రతిగా ఇరాన్ – ఇజ్రాయెల్ నగరాలపై క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వైమానిక ప్రాంతాన్ని మూసివేసి, విమానయాన సంస్థలు సేవలు నిలిపివేశాయి. ఈ దాడులపై ఇరాన్ విదేశాంగ మంత్రి అరఘ్చి తీవ్రంగా స్పందిస్తూ, “చట్టవిరుద్ధం”గా అభివర్ణించి ప్రతీకార హెచ్చరికలు జారీ చేశారు.
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. షాకింగ్ విషయం వెల్లడి!