Site icon HashtagU Telugu

Tunnel Under Cemetery : సమాధుల కింద రహస్య సొరంగం.. భారీగా ఆయుధాలు

Hezbollah Secret Tunnel Under Cemetery

Tunnel Under Cemetery :  లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్లు చివరకు సమాధులను కూడా వదల్లేదు. శ్మశాన వాటికలోని సమాధుల కింద రహస్య  సొరంగాలను నిర్మించుకున్నారు. వాటిలో భారీగా ఆయుధాలు, తుపాకులు, రాకెట్లను నిల్వ చేశారు. ఆ టన్నెల్ నుంచి పరిసర ప్రాంతాల్లో ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్లకు ఆదేశాలు అందేలా కమ్యూనికేషన్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సొరంగంలో మిలిటెంట్లు నిద్రించేందుకు స్లీపింగ్ క్వార్టర్‌లు కూడా ఉన్నాయి. లెబనాన్ భూభాగంలోకి చొరబడిన ఇజ్రాయెలీ ఆర్మీ.. ఒక గ్రామంలోని శ్మశానవాటికలో ఈ సొరంగాన్ని గుర్తించింది. దీనికి సంబంధించిన వీడియో(Tunnel Under Cemetery) తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. పేలుడు సామగ్రిని వినియోగించి ఆ సొరంగాన్ని ఇజ్రాయెలీ సైనికులు పేల్చివేశారు.  ‘‘హిజ్బుల్లాకు మానవ జీవితం అంటే లెక్క లేదు. చనిపోయినా, బతికినా పట్టించుకోదు’’ అని ఆ వీడియోలో ఇజ్రాయెలీ ఆర్మీ వ్యాఖ్యానించడం గమనార్హం.

Also Read :National Education Day : జాతీయ విద్యా దినోత్సవం.. నేటికీ అందని ద్రాక్షగా ఉన్నత విద్య

లెబనాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థను అంతం చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ అంటోంది. మరోవైపు పాలస్తీనాలోని గాజా ప్రాంతంపైనా ఇజ్రాయెలీ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. గాజాలోనూ ఇదే విధమైన చాలా సీక్రెట్ టన్నెల్స్‌ను ఇజ్రాయెల్్ ఆర్మీ గుర్తించింది.  ఇజ్రాయెల్‌తో పోల్చుకుంటే.. లెబనాన్ సైన్యం చాలా బలహీనమైంది. హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ లెబనాన్ ప్రభుత్వ అనుమతితోనే అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హిజ్బుల్లాకు లెబనాన్‌లో ఒక రాజకీయ పార్టీ ఉంది. దాని తరఫున చాలామంది లెబనాన్ పార్లమెంటుకు ఎన్నికవుతుంటారు.  గాజా అనేది పాలస్తీనాలోని ఒక చిన్న ఏరియా మాత్రమే. అయినా గాజాలోని మిలిటెంట్ల ఏరివేతకు ఇజ్రాయెల్ చాలా టైం తీసుకుంది. అగ్రరాజ్యం అమెరికా అండ ఉన్నా.. హిజ్బుల్లా(లెబనాన్), హమాస్ (గాజా)ల ఏరివేతను ఇజ్రాయెల్ సత్వరం పూర్తి  చేయలేకపోయింది. ఉగ్రవాదం సమసిపోవాలంటే..మిలిటెంట్ సంస్థల ఏరివేత తప్పనిసరి.

Also Read :Onion Prices : ఉల్లి ధరల మంట.. ఉత్తరాదిలో కిలో రూ.100.. తెలుగు రాష్ట్రాల్లోనూ పైపైకి