Lockdown: మధ్యప్రాచ్యంలో ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ ఆయిల్ సప్లైలో కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ దాదాపు మూతపడింది. దీనివల్ల ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 112 డాలర్లకు చేరుకోగా.. అమెరికాలో గ్యాసోలిన్ ధర గాలన్‌కు 5 డాలర్లుగా ఉంది. రవాణా ఖర్చులు పెరగడంతో ఆహార పదార్థాలతో సహా అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇది ఆహార భద్రతపై కూడా సంక్షోభాన్ని కలిగిస్తోంది.
ప్రపంచంపై నీడలా ‘లాక్‌డౌన్’ భయం
ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు తమ సర్వీసులను తగ్గిస్తున్నాయి. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఈ వారంలో 5 శాతం విమానాలను రద్దు చేయగా, ఇతర కంపెనీలు కూడా అదే బాటలో ఉన్నాయి. జపాన్, దక్షిణ కొరియాల్లో ఇంధన రేషనింగ్ ప్రారంభం కాగా.. బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, శ్రీలంకలోని పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. భారత్ వంటి దేశాలకు 80 శాతం చమురు ఈ మార్గం నుంచే వస్తుంది. అందుకే అక్కడ ద్రవ్యోల్బణం ఒత్తిడి వేగంగా పెరుగుతోంది.
Also Read: Whatsapp New Update : వాట్సాప్లో కొత్త ఫీచర్.. 15 నిమిషాల్లో మెసేజ్ డిలీట్!
భవిష్యత్తు కోసం సన్నద్ధత ఏమిటి?
అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) డిమాండ్‌ను తగ్గించడంపై దృష్టి సారిస్తూ ‘Sheltering from Oil Shocks’ అనే 10 సూత్రాల ప్రణాళికను విడుదల చేసింది. ఇందులో వాహనాల నంబర్ ప్లేట్ ఆధారంగా ప్రయాణ దినాలను నిర్ణయించడం, హైవేలపై వేగ పరిమితి, విమాన ప్రయాణాల్లో కోత, వర్క్ ఫ్రమ్ హోమ్, ఎలక్ట్రిక్ స్టవ్‌ల వాడకం వంటి చర్యలు ఉన్నాయి. కోవిడ్ కాలం నాటి ఇటువంటి వ్యూహాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని ఏజెన్సీ పేర్కొంది. అయితే వీటి ప్రభావం లాక్‌డౌన్ లాగే ఉంటుంది.
సన్నద్ధత ప్రారంభించిన పలు దేశాలు
ఆస్ట్రేలియా వంటి ప్రభుత్వాలు అనవసర ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇది కోవిడ్ కాలం నాటి భాషను గుర్తుకు తెస్తోంది. ఈ సంక్షోభం గనుక ఎక్కువ కాలం కొనసాగితే ప్రయాణాలు, వినియోగాన్ని నియంత్రించే డిజిటల్ పర్మిట్ సిస్టమ్ వరకు పరిస్థితి వెళ్లవచ్చు. ఇది ఇంధన భద్రత పేరుతో జరుగుతున్నప్పటికీ సామాన్య ప్రజల స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. భారత్ ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి సారించి తన సన్నద్ధతను వేగవంతం చేయాల్సి ఉంటుంది.
