Dalai Lama: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా (Dalai Lama) నిర్వాసన జీవితం గడుపుతూ చైనా పాలనకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఈ నెల 6వ తేదీన ఆయన 90 సంవత్సరాల వయస్సులోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన వారసుడిని ప్రకటించే అవకాశం ఉంది. చైనా పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగినప్పుడు బీజింగ్ దానిని అణచివేయడానికి ప్రయత్నించింది. 1959లో ఆ సమయంలో దలైలామా భారతదేశంలో ఆశ్రయం పొందారు. టిబెట్ బౌద్ధమత చరిత్రలో ఇప్పటివరకు 14 దలైలామాలు ఉన్నారు.
ప్రస్తుతం దలైలామా ఏదైనా ఒక ప్రకటన చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఈ నేపథ్యంలోనే టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ప్రస్తుత సంపద ఎంత ఉంది? ఆయన ఖర్చులు ఎక్కడి నుంచి నడుస్తాయి? ఆయన సంపాదన ఎలా జరుగుతుంది అనే ఆసక్తి ప్రజల్లో ఉంది.
దలైలామా సంపద ఎంత?
ప్రస్తుతం దలైలామా తన వారసుడి గురించిన చర్చల కారణంగా మీడియా వార్తల్లో నిలిచారు. దలైలామా త్వరలో తన వారసుడిని ప్రకటించనున్నారు. జులై 6న ఆయన 90 సంవత్సరాలు పూర్తి చేసుకునే రోజున తన వారసుడిని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆయన సంపద గురించి మాట్లాడితే.. మీడియా నివేదికల ప్రకారం ఆయన మొత్తం నికర సంపద 150 మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. మన ఇండియా కరెన్సీలో సుమారు రూ.1250 కోట్లు.
Also Read: Private School : అధికారుల వేధింపులకు నిరసనగా రేపు ఏపీలో ప్రైవేట్ స్కూళ్లు బంద్
అయితే, ఈ సంపద గణాంకం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే దలైలామా సాధారణ నిర్వాసన జీవితాన్ని గమనిస్తే ఇంత సంపద యజమానిగా ఉండటం నిజంగా ఆశ్చర్యకరం.
సంపాదన ఎలా?
దలైలామా ఆదాయ వనరుల గురించి మాట్లాడితే.. విరాళాలు, ప్రసంగాలు, పుస్తకాల విక్రయాల వంటి వాటి ద్వారా ఆయన సంపాదన జరుగుతుంది. అంతేకాకుండా రాయల్టీల రూపంలో కూడా ఆయనకు ఆదాయం వస్తుంది. వాణిజ్య ప్రకటనలు, సినిమాల్లో ఆయన చిత్రాన్ని ఉపయోగించడం వల్ల ఆయనకు రాయల్టీలు చెల్లించబడతాయి.
దలైలామా జీవనశైలి సరళమైనది. భోగభాగ్యాలకు దూరంగా ఉంటారు. ఇది బౌద్ధ సన్యాస సంప్రదాయాలకు అనుగుణంగా ఉంటుంది. ఆయన సంపద ఎక్కువగా గాడెన్ ఫోడ్రాంగ్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించబడుతుంది. ఇది మానవతా, విద్యా కార్యక్రమాలను సమర్థిస్తుంది. ఆయన ప్రచురించిన 58కి పైగా పుస్తకాలు.. ముఖ్యంగా “ఫ్రీడమ్ ఇన్ ఎక్సైల్” వంటి ఆత్మకథలు, రాయల్టీల ద్వారా గణనీయమైన ఆదాయాన్ని అందిస్తాయి. ఆయనకు 1989లో నోబెల్ శాంతి బహుమతి, 2006లో యూఎస్ కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్, 2012లో టెంపుల్టన్ బహుమతి వంటి అనేక అవార్డులు లభించాయి.