Hassan Nasrallah : హిజ్బుల్లా చీఫ్ హత్యపై యూఎన్‌కు ఇరాన్.. ఇజ్రాయెల్ తప్పేం లేదన్న అమెరికా

ఈ పరిణామాలపై హిజ్బుల్లా మద్దతుదారు ఇరాన్ (Hassan Nasrallah) ఘాటుగా స్పందించింది.

Published By: HashtagU Telugu Desk
Iran Un Hezbollah Chief Hassan Nasrallah

Hassan Nasrallah : లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ హసన్‌ నస్రల్లా చనిపోయిన సంగతి తెలిసిందే.  లెబనాన్‌, హిజ్బుల్లాలపై దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమర్ధించారు. హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ అంతం చేయడంలో తప్పేమీ లేదన్నారు. గతంలో ఎంతోమంది ఇజ్రాయెలీలు, అమెరికన్లు హిజ్బుల్లా దాడుల్లో చనిపోయారని తెలిపారు. ఇజ్రాయెల్ రక్షణకు అమెరికా కట్టుబడి ఉందని బైడెన్ స్పష్టం చేశారు.

Also Read :Telangana Tax Revenue : ఆగస్టులో రూ.13వేల కోట్లు.. తెలంగాణ పన్ను ఆదాయానికి రెక్కలు

ఈ పరిణామాలపై హిజ్బుల్లా మద్దతుదారు ఇరాన్ (Hassan Nasrallah) ఘాటుగా స్పందించింది.లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల అంశాన్ని చర్చించేందుకు  అత్యవసరంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం కావాలని పిలుపునిచ్చింది. కనీసం ఇతర దేశాల రాయబార కార్యాలయాలు, హైకమిషనరేట్‌లపై దాడి చేయకుండా ఇజ్రాయెల్‌ను నిలువరించాల్సిన అవసరం ఉందని ఇరాన్ పేర్కొంది. ‘‘అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయెల్ ఉల్లంఘించకుండా చూడాల్సిన బాధ్యత ఐరాస భద్రతా మండలిపై ఉంది. దేశ భద్రత పేరుతో ఇతర దేశాల్లో ఇజ్రాయెల్ అరాచకం చేయడం సరికాదు’’ అని పేర్కొంటూ ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ రాయబారి అమీర్ సయ్యిద్ ఇరావని ఓ లేఖను ఐరాస భద్రతా మండలికి రాశారు.  హిజ్బుల్లా చీఫ్‌ను హత్య చేయడం ద్వారా పశ్చిమాసియాను ఇజ్రాయెల్ యుద్ధపు ఊబిలోకి లాగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read :SpaceX Rescue Mission: సునీతా విలియమ్స్ మరియు టీం కోసం రెస్క్యూ మిషన్‌ ప్రారంభం

హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యను నిరసిస్తూ శనివారం రోజు ఇరాన్‌లో పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. వెంటనే ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. నస్రల్లా ఫొటోలను పట్టుకున్న నిరసనకారులు “రివేంజ్,” “డౌన్ విత్ ఇజ్రాయెల్,” “డౌన్ విత్ ది యూఎస్” అంటూ నినాదాలు చేశారు.  ఇంకోవైపు సిరియాలో నస్రల్లా హత్య వార్త విని కొన్ని వర్గాల ప్రజలు సంబురాలు చేసుకున్నారు. సిరియా విప్లవాన్ని అణచివేయడానికి అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్‌కు హిజ్బుల్లా గ్రూప్ సాయం చేసింది.  అప్పట్లో అసద్‌కు సహాయం చేయడానికి దాదాపు 50,000 వేల మంది హిజ్బుల్లా మిలిటెంట్లు సిరియాకు వెళ్లారు.

  Last Updated: 29 Sep 2024, 09:56 AM IST