Iran : అమెరికాతో అణు ఒప్పంద చర్చలకు తమకు ఆసక్తి లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “తదుపరి వారం ఇరాన్‌తో అణు చర్చలు జరుగుతాయన్న” ప్రకటనపై స్పందించిన ఇరాన్ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి అబ్బాస్ అరాగ్చీ.. ఇలాంటి చర్చలకు మేము సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. “అమెరికాతో సమావేశమయ్యే ఆలోచన కూడా మాకు లేదు. ఇటీవల మన దేశంపై జరిగిన దాడులు తీవ్రంగా నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పుడు మేము అణు కార్యక్రమాల పునరుద్ధరణపై అధ్యయనం చేస్తున్నాం,” అని అరగ్చీ వివరించారు.
ఇరాన్ వైఖరిపై స్పందించిన శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ మాట్లాడుతూ .. ప్రస్తుతానికి ఏమీ ఖచ్చితంగా నిర్ణయించబడలేదని తెలిపారు. అయితే మధ్యవర్తిగా ఉన్న ఖతార్‌తో అమెరికా సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు. ఇక, హేగ్‌లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ .. “ఇరాన్‌తో చర్చలు జరిగే అవకాశముంది. అణ్వాయుధ అభివృద్ధికి టెహ్రాన్ నో చెప్పేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాం” అని చెప్పారు. ఈ క్రమంలో అమెరికా విధించిన కొన్ని ఆంక్షలు, ముఖ్యంగా ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలు సడలించే అవకాశం ఉన్నదని వెల్లడించారు. ఇరాన్ పునర్నిర్మాణానికి నిధుల అవసరం ఉందన్న దృష్టితో కొన్ని ఆంక్షలను ఉపసంహరించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
Israel : ఖమేనీని హత్య చేసేందుకు బాగా వెతికాం.. ఇజ్రాయెల్ కీలక వ్యాఖ్యలు