Jinping Vs Army : చైనాలో ఏదో జరుగుతోంది ? దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. సైన్యంలోని ఉన్నత స్థానాల్లో ప్రక్షాళనను కొనసాగిస్తున్నారు. అత్యంత కీలకమైన చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ హీ వీడాంగ్‌ను అరెస్టు చేయించారు. చైనా ఆర్మీకి చెందిన జనరల్ లాజిస్టిక్స్ శాఖ మాజీ మంత్రి జావో కెషీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫుజియాన్ ప్రావిన్స్ పరిధిలోని చైనా ఆర్మీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న పలువురు ఉన్నతాధికారులను కూడా అరెస్టు చేశారు. ఈ పరిణామాలతో చైనాలో కలకలం రేగింది. ఇంతకీ వీరందరినీ అకస్మాత్తుగా ఎందుకు అరెస్టు చేశారు ? ఈ ఆర్మీ ఉన్నతాధికారులు షీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ఏదైనా కుట్ర పన్నారా ? ఆయన మాటను జవదాటారా ? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. చైనాలో(Jinping Vs Army) మీడియాపై కఠిన ఆంక్షలు ఉంటాయి. అందుకే నిజాలు బయటికి రావడానికి చాలా టైం పడుతుంది.
Also Read :DK Aruna : డీకే అరుణ ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. ఎట్టకేలకు దొరికాడు
అరెస్టులు ఇందుకేనా ?
- అత్యంత కీలకమైన సైనిక సమాచారాన్ని లీక్ చేశారనే అభియోగాలను చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ హీ వీడాంగ్ ఎదుర్కొంటున్నారట. వీటిపై దర్యాప్తు చేసే క్రమంలోనే ఆయనను అరెస్టు చేశారట.
- చైనాలోని నాన్ జింగ్ ప్రాంతంలో ఆర్మీ కార్యకలాపాలపై జనరల్ లాజిస్టిక్స్ శాఖ మాజీ మంత్రి జావో కెషీకి మంచి పట్టు ఉంది. నాన్ జింగ్ ప్రాంతంలో సైనిక బడ్జెట్ కేటాయింపులు, వనరుల పంపిణీ, రక్షణ పరిశ్రమలతో ఒప్పందాలు వంటి అంశాల్లో ఈయన కీలక పాత్ర పోషించారు. వీటిలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలను జావో కెషీ ఎదుర్కొంటున్నారు.
- తాజాగా అరెస్టయిన హీ వీడాంగ్, జావో కెషీలు జిన్‌పింగ్‌కు సన్నిహితులే. అయితే ఇందుకీ అరెస్టులు ? అవినీతి ఆరోపణలే కారణమా ? జిన్‌పింగ్‌పై తిరుగుబాటుకు ఏదైనా పథక రచన చేశారా ? అనేది తెలియాల్సి ఉంది.
- చైనా సర్కారు గతేడాది కూడా మియావో లి అనే ఉన్నతస్థాయి సైనిక అధికారిని అరెస్టు చేయించింది. అంతకుముందు చైనా రక్షణ మంత్రిని అరెస్టు చేశారు.
Also Read :Anirudh Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కేటీఆర్ మద్దతు..ఏంజరగబోతుంది..?
జిన్‌పింగ్ బిజీ..
చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ)లో నెలకొన్న ఆధిపత్య పోరుకు ఈ పరిణామం అద్దంపడుతోందని పరిశీలకులు అంటున్నారు. చైనా ఆర్మీలో ఉన్నతస్థానాల్లో ఉన్న వ్యక్తులు గ్రూపులుగా విడిపోయారు. ఓ వర్గం అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చెప్పినట్టు నడుస్తోంది. మరో వర్గం స్వతంత్రంగా వ్యవహరించాలని వాదిస్తోంది. స్వతంత్రంగా వ్యవహరించాలనే వైఖరిని తీసుకున్న సైనిక వర్గంలోని ఆర్మీ ఉన్నతాధికారులను కటకటాల వెనక్కి నెట్టే పనిలో జిన్‌పింగ్ బిజీగా ఉన్నారు.