UK MP Shivani Raja: వీడియో.. భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన శివానీ రాజా

బ్రిటీష్ సార్వత్రిక ఎన్నికల్లో కీర్ స్టార్మర్స్ లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భార‌త సంత‌తికి చెందిన‌ శివానీ రాజా (UK MP Shivani Raja) వార్తల్లో నిలిచారు.

Published By: HashtagU Telugu Desk
UK MP Shivani Raja

UK MP Shivani Raja

UK MP Shivani Raja: బ్రిటీష్ సార్వత్రిక ఎన్నికల్లో కీర్ స్టార్మర్స్ లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. 14 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి లేబర్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో భార‌త సంత‌తికి చెందిన‌ శివానీ రాజా (UK MP Shivani Raja) వార్తల్లో నిలిచారు. లీసెస్టర్ ఈస్ట్ సీటులో శివాని రాజా కన్జర్వేటివ్ పార్టీకి చారిత్రాత్మక విజయం సాధించి, లేబర్ పార్టీ 37 ఏళ్ల ఆధిపత్యానికి ముగింపు పలికారు. ఆమె భారతీయ సంతతికి చెందిన లేబర్ అభ్యర్థి రాజేష్ అగర్వాల్‌పై పోటీ చేశారు. శివానీ రాజా బ్రిటన్ పార్లమెంట్‌లోభగవద్గీతను చేతిలో పట్టుకుని ప్రమాణం చేశారు.

బ్రిటీష్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లీసెస్టర్ ఈస్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంట్‌లో ప్రమాణం చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు శివాని రాజా ఎక్స్‌లో పేర్కొంది. హిజ్ మెజెస్టి కింగ్ చార్లెస్‌కి గీతా తన విధేయతను చాటుకున్నందుకు నేను నిజంగా గర్వపడుతున్నానని పేర్కొన్నారు. 2022లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ టీ20 ఆసియా కప్ మ్యాచ్ తర్వాత భారతీయ హిందూ సమాజం, ముస్లింల మధ్య ఘర్షణ జరిగిన లీసెస్టర్ సిటీ ఇటీవలి చరిత్రను పరిశీలిస్తే శివాని విజయం ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.

Also Read: BJP Vs BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆకర్ష్‌కు బీజేపీ నో.. ప్లాన్ అదేనా ?

ఈ ఎన్నికల్లో శివాని రాజా 14,526 ఓట్లను సాధించి, 10,100 ఓట్లు సాధించిన లండన్ మాజీ డిప్యూటీ మేయర్ రాజేష్ అగర్వాల్‌ను ఓడించారు. లీసెస్టర్ ఈస్ట్ 1987 నుండి లేబర్ బలమైన కోటగా ఉన్నందున ఈ విజయం కూడా ముఖ్యమైనది. శివాని విజయంతో 37 ఏళ్లలో తొలిసారిగా నియోజకవర్గంలో టోరీ ఎన్నికయ్యారు. బ్రిటన్‌లో జూలై 4న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శివాని రాజాతో పాటు మరో 27 మంది భారతీయ సంతతికి చెందిన ఎంపీలు హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు. కాగా బ్రిటీష్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఎన్నికైన వందలాది మంది ఎంపీలు ఉత్సాహంగా పార్లమెంటుకు చేరుకున్నారు. కొత్త హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఇప్పటివరకు ఎన్నికైన మహిళల సంఖ్య అత్యధికంగా 263గా ఉంది. ఇది మొత్తం సంఖ్యలో 40 శాతం. వీరిలో గరిష్టంగా 90 మంది నల్లజాతి ఎంపీలు ఉన్నారు.

కీర్ స్టార్మర్ బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి అయ్యారని మన‌కు తెలిసిందే. బ్రిటన్‌ను పునర్నిర్మిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. 650 మంది సభ్యుల హౌస్ ఆఫ్ కామన్స్‌లో లేబర్ పార్టీ 412 సీట్లు సాధించింది. ఈ సంఖ్య ఆ పార్టీ 2019లో సాధించిన సీట్ల కంటే 211 ఎక్కువ. రిషి సునక్‌కి చెందిన కన్జర్వేటివ్ పార్టీ గత ఎన్నికల కంటే 250 సీట్లు తక్కువగా 121 సీట్లు మాత్రమే గెలుచుకుంది. లేబర్ పార్టీ ఓట్ షేర్ 33.7 శాతం కాగా, కన్జర్వేటివ్ పార్టీ ఓట్ షేర్ 23.7 శాతం. బ్రిటీష్ మాజీ ప్రధాని రిషి సునక్ తన వీడ్కోలు ప్రసంగంలో ఉద్వేగానికి లోనయ్యారు. తన నేతృత్వంలోని పార్టీకి ఘోర పరాజయాన్ని అందించిన ఓటర్లకు క్షమాపణలు చెప్పారు. మీ నిర్ణయం మాత్రమే ముఖ్యమని అన్నారు. ఈ ఓటమికి నేను బాధ్యత వహిస్తాను అని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

  Last Updated: 11 Jul 2024, 09:39 AM IST