No Chance To Trump : రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వాన్ని ఆశిస్తున్న భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వ పోటీలో మొదటి స్థానంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పై ఆమె విరుచుకుపడ్డారు. ఈ పోటీలో డొనాల్డ్ ట్రంప్ ముందు వరుసలో ఉన్నప్పటికీ.. ఆయనకు రిపబ్లికన్ పార్టీ తరఫున నామినేషన్ ఛాన్స్ లభించకపోవచ్చని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్కీ హేలీ కామెంట్ చేశారు. ఎవరైనా ఆ అంచనాలో ఉంటే.. ఇప్పటి నుంచి ఆలోచన మార్చుకోవాలన్నారు. “ట్రంప్ కు మళ్లీ రిపబ్లికన్ పార్టీ నామినేషన్ దక్కుతుందని నేను అనుకోను. నాకు కూడా ఛాన్స్ లభించొచ్చు. బైడెన్, కమలా హారిస్ కంటే మెరుగైన లీడర్ షిప్ ను మా రిపబ్లికన్ పార్టీ అమెరికాకు ఇస్తుందని నేను నమ్ముతున్నాను’’ అని నిక్కీ హేలీ చెప్పారు.
Also read : Expensive Lawyer – Third Marriage : ఇండియాలోనే కాస్ట్లీ లాయర్ మూడో పెళ్లి.. ఎవరు ? ఏమిటి ?
“ట్రంప్ ప్రస్తుతానికి నిర్దోషి. ఎందుకంటే ఆయనపై నమోదైన నేరాభియోగాలు రుజువు కాలేదు. అమెరికా ప్రజలు తెలివైన వారు. నేరస్థులకు వాళ్లు ఓటు వేయరు. గెలుపు గుర్రాల వైపే అమెరికా ప్రజలు ఉంటారు’’ అని ఆమె (No Chance To Trump) పేర్కొన్నారు. ‘‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఏజ్ లిమిట్ పెడితే బాగుంటుంది. ఈ ప్రపోజల్ ను నేను సపోర్ట్ చేస్తున్నాను.. 75 ఏళ్లు దాటిన వాళ్లు అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వానికి అప్లై చేస్తే వారికి మానసిక సామర్థ్యాలను పరీక్షించే ఎగ్జామ్ ను పెట్టాలి’’ అని పరోక్షంగా 77 ఏళ్ల ట్రంప్ ను ఉద్దేశించి నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు.