అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు చెప్పడం ఆలస్యం..సంచలన నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటూ.. కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా ఫస్ట్ నినాదం(Donald Trump 1st Slogan)తో తమ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో భారత్ (India).. ముందస్తు చర్యల్లో భాగంగా అమెరికాలో అక్రమంగా జీవిస్తున్న 18 వేల మంది భారతీయులను తిరిగి ఇండియా తీసుకు వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ట్రేడ్వార్ వంటి సమస్యలను దూరంగా ఉంచుతూ, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది.
Rashmika : వీల్చైర్లో రష్మిక..ఆందోళనలో ఫ్యాన్స్
ఇరు దేశాల అధికారులు కలిసి వీరిని గుర్తించారు. వీరిలో చాలామంది వీసా గడువు ముగిసినా అక్కడే ఉన్నవారు లేదా వలస చట్టాలు ఉల్లంఘించినవారుగా తెలుస్తోంది. అయితే, ఈ చర్యల వల్ల స్టూడెంట్ వీసా, వర్క్ వీసాలపై ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. వీసాలు మరియు గ్రీన్కార్డుల జారీని తగ్గించడం వంటి ఆంక్షలు అమెరికా అమలు చేయకుండా ఉండటానికి, అక్రమ వలసదారులను వెనక్కి తీసుకురావడం మంచి పద్ధతి అని భారత్ వ్యూహంగా వ్యవహరిస్తుంది. ట్రంప్ పాలసీల నేపథ్యంలో భారత్ తన దేశీయ వలస విధానాలను కూడా సమీక్షిస్తోంది.
Davos : తెలంగాణలో మరో రూ.10వేల కోట్ల పెట్టుబడులు..రేవంతా మజాకా..!
తాజాగా అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. తమ దేశంలో ఉన్న అక్రమ వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపించేందుకు సిద్దమయ్యాడు. అలాగే ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై అధిక పన్ను విధిస్తున్నారు. ముఖ్యంగా మెక్సికో, కెనడా నుంచి ఎక్కువ మంది తమ దేశంలోకి అక్రమంగా వలస వచ్చారని చెబుతూనే.. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆ రెండు దేశాలపై 25 శాతం సుంకాలు విధించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈక్రమంలోనే భారత్ మందుస్తు చర్యలు మొదలుపెట్టింది. రాబోయే రోజుల్లో ట్రంప్ ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.