Pakistan Copying : భారత్‌ను కాపీ కొట్టడాన్ని పాకిస్తాన్ పనిగా పెట్టుకుంది. భారత ప్రభుత్వం ఏం చేస్తే.. వెంటనే ఆ పనిని చేసేందుకు పాకిస్తాన్ రెడీ అయిపోతోంది. దీన్నిబట్టి పాకిస్తాన్ ప్రభుత్వం బుర్ర తక్కువతనం అందరికీ తెలిసిపోతోంది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదం గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్ 7 అఖిలపక్ష టీమ్‌లను ప్రకటించింది. ఈవిషయం తెలియగానే పాక్ షాక్‌కు గురైంది. వెంటనే తాము కూడా ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని విదేశాలకు పంపుతామని వెల్లడించింది. ఆ ప్రతినిధి బృందానికి పాకిస్తాన్ పెట్టిన పేరు గురించి వింటే అందరూ అవాక్కు అవుతారు. ‘గ్లోబల్ పీస్ మిషన్’ అనే పేరుతో పాకిస్తాన్ ప్రత్యేక ప్రతినిధి బృందం విదేశాల్లో తిరుగుతుంది. పెద్దపెద్ద ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు, కరుడుగట్టిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ నోటి నుంచి గ్లోబల్ పీస్ మిషన్ అనే పదాన్ని వింటే ప్రపంచదేశాలు నవ్వుకోవడం ఖాయం.
Also Read :Diplomatic War : శశిథరూర్‌కు పెద్ద బాధ్యతలు.. అఖిలపక్ష టీమ్‌లు పర్యటించే దేశాలివీ
బిలావల్ భుట్టో సారథ్యం
ఉగ్రవాదులందరినీ జైలులో వేసి.. ఉగ్రవాద సంస్థలను అన్నింటినీ బ్యాన్ చేసిన తర్వాత కానీ పాకిస్తాన్‌ను(Pakistan Copying) ఎవ్వరూ నమ్మరు. ఆపరేషన్ సిందూర్ పేరుతో తమ దేశంపై భారత్ దాడి చేసిందనే విషయాన్ని ప్రపంచ దేశాలకు వివరించేందుకు గ్లోబల్ పీస్ మిషన్‌ను వాడుకుంటామని పాకిస్తాన్ ప్రభుత్వం అంటోంది. పహల్గాం ఉగ్రదాడి గురించి.. ఆ దాడిలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల గురించి మాట్లాడని పాక్ సర్కారు.. ఆపరేషన్ సిందూర్‌ను భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తుండటం విడ్డూరంగా ఉంది. పాకిస్తాన్ ‘గ్లోబల్ పీస్ మిషన్’ టీమ్‌కు మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో సారథ్యం వహిస్తారట.
Also Read :India Pakistan Ceasefire : ‘కాల్పుల విరమణ’పై భారత ఆర్మీ కీలక ప్రకటన
ఈ దేశాల్లో పర్యటన..
ఈ టీమ్ అమెరికా, యూకే, బెల్జియం, ఫ్రాన్స్, రష్యా సహా పలు దేశాల్లో పర్యటిస్తుందట. ఈ ప్రతినిధి బృందంలో పాకిస్తాన్ మాజీ డిప్యూటీ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్, మాజీ రక్షణ మంత్రి ఖుర్రం దస్తగిర్ ఖాన్, మాజీ విదేశాంగ కార్యదర్శి జలీల్ అబ్బాస్ జిలానీ సభ్యులుగా ఉంటారని సమాచారం. పాకిస్తాన్ బృందానికి నాయకత్వం వహించాలని తనను పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కోరారని పేర్కొంటూ బిలావల్ భుట్టో సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.