Trump Vs Putin : డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇప్పుడే ఆయన యాక్టివ్ అయిపోయారు. ఉక్రెయిన్‌తో గత మూడేళ్లుగా యుద్ధంలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ ఫోన్ కాల్ చేశారు. గత గురువారం రోజు అమెరికాలోని ఫోర్లిడాలో ఉన్న తన ఎస్టేట్ నుంచి పుతిన్‌కు ట్రంప్ ఫోన్ చేసినట్లు తెలిసింది. ఈసందర్భంగా ఇద్దరు అగ్ర రాజ్యాధినేతలు(Trump Vs Putin) పలు కీలక అంశాలపై మాట్లాడుకున్నారు.
Also Read :Pregnancy Tips : ఒక స్త్రీకి ఎన్నిసార్లు అబార్షన్ సురక్షితం..? దాని దుష్ప్రభావాలు ఏమిటి..?
ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఇంకా విస్తరించొద్దని పుతిన్‌ను ట్రంప్ కోరారు. దీనిపై పరస్పర చర్చలు జరిపి ఒక పరిష్కారాన్ని కనుగొందామని ఆయన పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన ప్రతీ సాయం చేసేందుకు తాను సిద్ధమని పుతిన్‌తో ట్రంప్ చెప్పినట్లు సమాచారం. దీనికి పుతిన్ కూడా అంగీకరించినట్లు తెలిసింది. మొత్తం మీద ట్రంప్ గెలుపుతో మూడేళ్ల రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఆగే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. జో బైడెన్ హయాంలో ఈవిధంగా నేరుగా పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన దాఖలాలు లేవు. యుద్ధం చేసేందుకు ఉక్రెయిన్‌కు అవసరమైన సైనిక సహాయాన్ని అందించడానికే బైడెన్ పరిమితమయ్యారనే టాక్ ఉంది. ట్రంప్.. అందుకు పూర్తి విభిన్నం. అందుకే ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు అమెరికన్లు పట్టం కట్టారు.
Also Read :Winter : శీతాకాలం మొదలైంది..ఇలా చేస్తే మీకు ఏ వ్యాధులు సోకవు …
మొదటి నుంచీ ట్రంప్ శాంతి మంత్రమే జపిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సేనలు దాదాపు 20 ఏళ్లు (2001 నుంచి 2020) వరకు ఉన్నాయి. వాటిని అక్కడి నుంచి వెనక్కి పిలిపించే కీలక నిర్ణయం గత ట్రంప్ హయాంలోనే వెలువడింది. ట్రంప్ ఈసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఇలాంటి మరిన్ని నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఇక రష్యాతో యుద్ధాన్ని ఆపేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సిద్ధంగానే ఉన్నారు. అయితే రష్యా ఆక్రమించుకున్న తమ భూభాగాన్ని తిరిగి అప్పగించాలని ఆయన కోరుతున్నారు.