RS 419 Crores Awarded : ‘‘100 మంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు కానీ.. ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు’’ అని న్యాయసూత్రాలు చెబుతున్నాయి. కానీ అమెరికాలో ఒక నిర్దోషికి (మార్సెల్ బ్రౌన్) 2008 సంవత్సరంలో శిక్షపడింది. అతడు చేయని తప్పుకు.. దాదాపు పదేళ్ల పాటు జైలులో గడపాల్సి వచ్చింది. చివరకు నిజం గెలిచింది. న్యాయం నెగ్గింది. మార్సెల్ బ్రౌన్ ఏ తప్పూ చేయలేదని చికాగో ఫెడరల్ జ్యూరీ కోర్టు తేల్చింది. అనవసరంగా పదేళ్ల పాటు శిక్ష అనుభవించినందుకు పరిహారంగా అతడికి రూ.419 కోట్లను అందించాలని పోలీసు శాఖను ఆదేశించింది.
Also Read :Trump Vs Kamala : ‘‘కమల పెద్ద మార్క్సిస్ట్’’.. ‘‘ట్రంప్ అమెరికాను చైనాకు అమ్మేశారు’’.. హోరాహోరీగా డిబేట్
వివరాల్లోకి వెళితే.. మార్సెల్ బ్రౌన్‌ను 2008 సంవత్సరంలో పోలీసులు అరెస్టు చేశారు. 19 ఏళ్ల యువకుడిని హత్య చేశాడనే అభియోగాలతో అతడిపై కేసును నమోదు చేశారు. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన కోర్టు.. అతడిని దోషిగా తేల్చి, 35 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో మార్సెల్ బ్రౌన్ పదేళ్ల పాటు (2018 సంవత్సరం వరకు) జైలులో గడిపారు. కట్ చేస్తే.. 2018 సంవత్సరంలో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు టార్చర్ చేయడం, భయపెట్టడం వల్ల చేయని తప్పును మార్సెల్ బ్రౌన్ అంగీకరించాడంటూ అతడి న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను న్యాయస్థానానికి సమర్పించారు. 2018 నుంచి ఇప్పటివరకు ఈ పిటిషన్‌పై వివిధ కోర్టులలో విచారణ కొనసాగింది. ఆరేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం.. మార్సెల్ బ్రౌన్(RS 419 Crores Awarded) నిర్దోషి అని కోర్టు తేల్చింది. అతడిపై తప్పుడు కేసును పెట్టారని విచారణలో గుర్తించింది.
Also Read :Pak Violates Ceasefire : పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్‌కు గాయాలు.. భారత్ ప్రతిఘటన
తప్పుడు కేసులో బ్రౌన్‌ను అరెస్టు చేసినందుకు 10 మిలియన్ డాలర్లు, పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించేలా చేసినందుకు 40 మిలియన్ డాలర్ల పరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే మొత్తం 50 మిలియన్ డాలర్లు మార్సెల్ బ్రౌన్‌కు అందుతాయి. వీటి విలువ మన భారత కరెన్సీలో దాదాపు రూ.419 కోట్లు.