Bangladesh : బంగ్లాదేశ్ విముక్తికి సంబంధించిన స్మారకాలను కూడా బంగ్లాదేశ్‌లో నిరసనకారులు ధ్వంసం చేశారు. 1971 యుద్దం తర్వాత పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశ్, భారత్‌లకు సరెండర్ అవుతున్న విధంగా నిర్మించిన శిల్పాలను కొందరు దుండగులు నేలమట్టం చేశారు. బంగ్లాదేశ్‌లోని ముజీబ్ నగర్‌లో ‘1971 షహీద్ మెమోరియల్ కాంప్లెక్స్’ ఉంది. ఇందులోనే పాకిస్తాన్ ఆర్మీ సరెండర్‌కు సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. జీవకళను ఉట్టిపడేలా ఉండే ఆ శిల్పాలను పలువురు అల్లరిమూకలు ధ్వంసం చేశారు. 1971 యుద్ధంలో బంగ్లాదేశ్‌కు భారత్ అన్ని విధాలా సహాయ సహకారాలను అందించింది. అందువల్లే ఆనాడు పాకిస్తాన్ ఆర్మీ మట్టి కరిచి సరెండర్ అయినట్లు ప్రకటించింది. ఈ ఫొటోలను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పోస్ట్ చేశారు. భారత వ్యతిరేక అల్లరి మూకలే బంగ్లాదేశ్‌లో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. ఆ ఘటన తనను ఎంతో కలచివేసిందని థరూర్ పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join
బంగ్లాదేశ్‌లో(Bangladesh) భారత కల్చరల్ సెంటర్లు, ఆలయాలు, హిందువుల ఇళ్లపై దాడులు జరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోందని థరూర్ చెప్పారు. కొన్నిచోట్ల అల్లరి మూకల నుంచి హిందువులను స్థానిక ముస్లిం పౌరులే రక్షిస్తుండటం చాలామంచి విషయమన్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనుస్ మైనారిటీలపై అణచివేత చర్యలను అడ్డుకోవాలని థరూర్ కోరారు. బంగ్లాదేశ్‌లోని అన్ని మతాల వారికి తగిన రక్షణ లభించాలన్నారు. ఈ కష్టకాలంలో బంగ్లాదేశ్‌తోనే భారత్ ఉందని చెప్పారు. అయితే అలాంటి అల్లరిమూకల దుశ్చర్యలను భారత్ ఎప్పటికీ ఖండిస్తూనే ఉంటుందని థరూర్ తెలిపారు.
Also Read :Kavitha Bail : కవితకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
1971లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్దం జరిగింది. ఇందులో పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ తనను తాను భారత ఆర్మీ, బంగ్లాదేవ్ ముక్తి వాహిని ఎదుట సరెండర్ అయ్యారు. దాదాపు 93వేల పాకిస్తాన్ సైనికులతో కలిసి సరెండర్ అవుతున్నట్లు భారత ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ జగ్జీత్ సింగ్ అరోరా ఎదుట అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద సైనిక సరెండర్ ఘటన అని చరిత్రకారులు చెబుతుంటారు.