India To US: అమెరికాలో హైదరాబాదీల కష్టాలు

హైదరాబాద్ కు చెందిన మహ్మద్ అమర్ గొంతు ఇన్ఫెక్షన్ తో అమెరికా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. స్టూడెంట్ వీసాపై ఆగస్టు 31న అమెరికాకు వెళ్లిన మహ్మద్ అమెర్ ప్రస్తుత పరిస్థితి అంత్యంత విషమం

India To US: హైదరాబాద్ కు చెందిన మహ్మద్ అమర్ గొంతు ఇన్ఫెక్షన్ తో అమెరికా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. స్టూడెంట్ వీసాపై ఆగస్టు 31న అమెరికాకు వెళ్లిన మహ్మద్ అమెర్ ప్రస్తుత పరిస్థితి అంత్యంత విషమంగా ఉన్నట్టు అతని సోదరుడు మొహమ్మద్ ముజాహెద్ తెలిపాడు. జార్జియాలోని అట్లాంటాలోని అట్రియం హెల్త్ నావిసెంట్ ది మెడికల్ సెంటర్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు వాపోయాడు. కొన్ని వారాల క్రితం అమెర్ దంతాలలో ఇన్ఫెక్షన్ సోకింది. ఆ తర్వాత అది అతని గొంతుకు వ్యాపించింది. మహ్మద్ అమెర్ ఇండియానా వెస్లియన్ విశ్వవిద్యాలయంలో ఐటీలో మాస్టర్స్ చేయడానికి వెళ్ళాడు.

అమెరికాకు వెళ్లిన విద్యార్థుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో హైదరాబాద్ విద్యార్థి సయ్యదా లులు మిన్హాజ్ అమెరికాలోని చికాగో వీధుల్లో దుర్భర జీవితాన్ని అనుభవించింది. సయ్యదా లులు మిన్హాజ్ మాస్టర్స్ చేసేందుకు 2021 ఆగస్టులో అమెరికా వెళ్లింది. యువతి వస్తువులు ఎవరో దొంగలించారని, దీంతో చికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తున్నట్లు హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన కొందరు గుర్తించారు. దీంతో ఆమె తల్లికి తెలియజేశారు. కుమార్తె పరిస్థితి తెలుసుకున్న యువతి తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమా తన కుమార్తెను తిరిగి భారత్ కు తీసుకురావాల్సిందిగా కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ను కోరారు.

Also Read: AP : చంద్రబాబు అరెస్ట్ ను క్యాష్ చేసుకోవాలని జగన్ ముందస్తుకు వెళ్తున్నాడా..?